Begin typing your search above and press return to search.

తెలుగు వద్దు తమిళం ముద్దు అంటున్న సీనియర్ బ్యూటీ...!

By:  Tupaki Desk   |   13 Aug 2020 11:30 PM GMT
తెలుగు వద్దు తమిళం ముద్దు అంటున్న సీనియర్ బ్యూటీ...!
X
టాలీవుడ్ ని కొన్నేళ్లపాటు తన నడుము అందాలతో ఊపేసింది గోవా బ్యూటీ ఇలియానా. 'దేవదాసు' సినిమాతో తెలుగు తెర‌కు పరిచయమైన ఈ బ్యూటీ వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు 'పోకిరి' చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో ఇలియానా ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది. స్టార్ హీరోలందరి సరసన నటించిన ఇల్లీ బేబీ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా నిలిచింది. సౌత్ ఇండస్ట్రీలో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఈ భామ బాలీవుడ్‌ లో అడుగు పెట్టింది. అక్కడ కూడా వరుస అవకాశాలు అందిపుచ్చుకొని నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ టైంలో సౌత్ ఇండస్ట్రీ క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా వదులుకుంది ఇలియానా. కానీ అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా. రాను రాను బాలీవుడ్ లో ఈ బ్యూటీ పరిస్థితి మారిపోయింది.

ఈ నేపథ్యంలో ఇల్లీ బేబీ చాలా గ్యాప్ తరువాత తెలుగులో 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ప్లాప్ అవడంతో పాటు ఇలియానా బాడీలో వచ్చిన మార్పులు ఫ్యాన్స్ ని కంగారు పెట్టాయి. అయితే గోవా బ్యూటీ కష్టపడి ఇప్పుడు సన్నగా సన్నజాజిలా మారి అదరగొడుతోంది. వ్యాయామాలు.. డైట్ ద్వారా ఇప్పటికే బరువు తగ్గిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకి హీట్ పెంచేస్తోంది. 80 డేస్ ఛాలెంజ్ అంటూ రెగ్యులర్ వర్కౌట్స్ చేస్తూ అమ్మడు మరోసారి ఇండస్ట్రీ తన వైపు చూసేలా చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇలియానా టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్ దక్కించుకుందని వార్తలు వచ్చాయి. 'కింగ్' నాగార్జున సరసన నటించే ఛాన్స్ ఇలియానా కొట్టేసిందని న్యూస్ వచ్చినప్పటికీ అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.

ఇదిలా ఉండగా గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు తెలుగు కంటే తమిళ్ ఇండస్ట్రీకే ప్రాధాన్యత ఇస్తోందని కాస్టింగ్ వర్గాలు చెప్తున్నాయి. తెలుగు సినిమాల గురించి పక్కన పెట్టండి.. తమిళ్ లో ఏదైనా క్రేజీ ప్రాజెక్ట్ వెతకండి అని వారికి బంపర్ ఆఫర్ ఇస్తుందట ఇలియానా. మొత్తం మీద ఈ సీనియర్ బ్యూటీ మరోసారి సౌత్ ఇండస్ట్రీని తన అందచందాలతో కట్టిపడేయడానికి రెడీ అయిందనేది మాత్రం అర్థం అవుతోంది. ఇక ఇలియానా అభిషేక్ బచ్చన్ తో కలిసి నటించిన హిందీ మూవీ ''ది బిగ్ బుల్'' త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.