Begin typing your search above and press return to search.

ప్రభాస్ రాముడి రోల్.. సీనియర్ బ్యూటీ కాంట్రవర్సీ లాజిక్!

By:  Tupaki Desk   |   9 Jun 2023 5:44 PM GMT
ప్రభాస్ రాముడి రోల్.. సీనియర్ బ్యూటీ కాంట్రవర్సీ లాజిక్!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న ప్రేక్షకుల ముందుకి రానుంది. భారీ బడ్జెట్ తో విజువల్ గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. రామాయణం కథ ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు ఓం రౌత్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అందులో ప్రధాన ఘట్టాల ని తీసుకొని హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ప్రెజెంట్ చేశారు.

ఇక సినిమా కోసం ఎంత ఎఫర్ట్ పెట్టారనేది ట్రైలర్స్ లోనే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక జూన్ 16 ఆదిపురుష్ రిలీజ్ కోసం దేశ వ్యాప్తంగా రామాయణాన్ని ఇష్టపడే వారితో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ సర్టిఫికేట్ కూడా మూవీ కి వచ్చేసింది. సినిమా నిడివి మూడు గంటల వరకు ఉండనుంది.

అయితే ఆదిపురుష్ చిత్రం లో శ్రీరాముడు తో పాటు మిగిలిన పాత్రల చిత్రణ పై కొంతమంది హిందుత్వ వాదులు ఇప్పటికి అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బీజేపీ పార్టీ ఆదిపురుష్ మూవీకి సపోర్ట్ గా ఉంది. ఈ నేపథ్యంలో కొంత వరకు ఈ చిత్రం పై నెగిటివ్ పబ్లిసిటీ తగ్గింది. సెలబ్రిటీలు ఆదిపురుష్ చిత్రాన్ని ఏదో ఒక విధంగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

అయిన కొంతమంది నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా సీనియర్ హీరోయిన్ కస్తూరి ఆదిపురుష్ లో రామలక్ష్మణుడి పాత్రల పై ట్విట్టర్ ద్వారా విమర్శలు చేసింది. ఏ సంప్రదాయం లో అయిన రామలక్ష్మనులు గెడ్డం, మీసాల తో ఉండటం ఎక్కడైనా చూసారా? ఇలాంటి వికారమైన పనులు ఎందుకు చేస్తారు. ప్రభాస్ తెలుగు వాడు. తెలుగు లో చాలా మంది లెజెండరీ యాక్టర్స్ రామాయణం లో శ్రీరాముడి పాత్రని ధరించారు.

వారిని రిఫరెన్స్ గా తీసుకున్నా బాగుండేది అంటూ విమర్శలు చేసింది. ఆదిపురుష్ పోస్టర్ ని షేర్ చేసి దాని పై ఈ వ్యాఖ్యలు కాస్తూ చేశారు. అయితే కస్తూరి చేసిన వ్యాఖ్యల పై డార్లింగ్ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏదైనా తీర్పు ఇచ్చే ముందు ఆ సినిమా లో దర్శకుడు ఏం చెప్పాలని అనుకుంటున్నాడో తెలుసు కునే ప్రయత్నం చేయండి. ఆదిపురుష్ లో శ్రీరాముడి పాత్రని ఒక యోధుడు, వారియర్ గా చూపించారు. అలాంటి క్యారెక్టర్ లో ప్రభాస్ ఆహార్యం పెర్ఫెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.