Begin typing your search above and press return to search.

సీనియ‌ర్సా మ‌జాకా బాక్సాఫీస్ ద‌బిడి దిబిడే!

By:  Tupaki Desk   |   31 Jan 2023 8:00 AM GMT
సీనియ‌ర్సా మ‌జాకా బాక్సాఫీస్ ద‌బిడి దిబిడే!
X
క‌రోనా త‌రువాత కొంత మంది హీరోల ప‌రిస్థితి మ‌రీ అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. మ‌రీ ముఖ్యంగా ఓటీటీల యుగంలో సీనియ‌ర్ స్టార్ల కోసం ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌స్తారా? .. వ‌చ్చి చూస్తారా? అనే కామెంట్ లు కూడా వినిపించాయి. ఈ కామెంట్ ల‌ని నిజం చేస్తూ కొంత మంది సీనియ‌ర్ హీరోల సినిమాలు తెలుగు, హిందీ భాష‌ల్లో బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్లుగా నిలిచి షాకిచ్చాయి. దీంతో ఇక సీనియ‌ర్ హీరోల సినిమాల ప‌రిస్థితి ఏంటీ? అనే ప్ర‌శ్న స‌ర్వ‌త్రా వినిపించింది.

కానీ కామెంట్ లుకు వాస్త‌వానికి చాలా తేడా క‌నిపిస్తోంది. అందుకు నిద‌ర్శ‌న‌మే సీనియ‌ర్ స్టార్లు న‌టించిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల్ని తిర‌గ‌రాస్తూ సీనియ‌ర్ల‌తో పెట్టుకుంటే ద‌బిడి దిబిడే అని నిరూపిస్తున్నారు. ఆరు ప‌దులు దాటిన సీనియ‌ర్ హీరోలు బాక్సాఫీస్ ని రికార్డు స్థాయి వ‌సూళ్ల‌తో షేక్ చేస్తున్న తీరు ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది. నాలుగేళ్ల విరామం త‌రువాత క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన 'విక్ర‌మ్‌' బాక్సాణ‌ఫీస్ వ‌ద్ద ర‌కార్డు స్తాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి విస్మ‌యాన్ని క‌లిగించిన విష‌యం తెలిసిందే.

ఇక ప‌దేళ్ల విరామం త‌రువాత మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నంబ‌ర్ 150'తో మళ్లీ రంగంలోకి దిగారు. భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి త‌న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌టేద‌ని నిరూపించారు. అయితే ఆ మూవీ త‌రువాత చిరు ఆ స్థాయి స‌క్సెస్‌ని, వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేక‌పోయారు. అయితే ఆ లోటుని రీసెంట్ గా విడుద‌లైన 'వాల్తేరు వీర‌య్య‌' బ‌ర్తీ చేసింది. సంక్రాంతి బ‌రిలో నిలిచిన ఈ మూవీ ఇప్ప‌టి వ‌ర‌కు 200 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ మ‌రిన్ని రికార్డుల దిశ‌గా ప‌య‌నిస్తోంది.

ఇక మ‌రో సీనియ‌ర్ స్టార్ నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ఈ సంక్రాంతికి త‌న మార్కు ఫ్యాక్ష‌న్ మూవీ ' వీర సింమారెడ్డి'తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఇప్ప‌టికే 120 కోట్ల మార్కుని దిటిన ఈ మూవీ రానున్న రోజుల్లో 150 కోట్ల మార్కుని చేరుకోనుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

ఈ సీనియ‌ర్ హీరోల త‌ర‌హాలోనే 57 ఏళ్ల షారుక్ ఖాన్ కూడా త‌న‌దైన పంథాలో బాక్సాఫీస్ ని ద‌బిడి దిబిడి ఆడేస్తున్నాడు. దాదాపు నాలుగేళ్ల విరామం త‌రువాత షారుక్ 'ప‌ఠాన్‌' మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే.

భారీ అంచ‌నాలు, బాయ్ కాట్ వివాదం నేప‌థ్యంలో విడుద‌లైన ఈ మూవీ వారం తిర‌క్కుండానే రూ. 500 కోట్ల మేర వాసూళ్ల‌ని రాబ‌ట్ట‌డంతో అంతా నివ‌వ్ఎర‌పోతున్నారు. ఇప్ప‌టికీ అదే జోష్ తో సాగుతున్న ఈ మూవీ వ‌సూళ్లు ఏ స్థాయికి చేర‌తాయో ఎవ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు. రానున్న రోజుల్లో 'ప‌ఠాన్‌' రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని న‌మోద్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోందని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఐదు ప‌దులు దాటి కొంద‌రు. ఆరు ప‌దుల వ‌య‌సులో మ‌రి కొంత మంది సీనియ‌ర్ లు బాక్సాఫీస్ ని త‌మ సినిమాల‌తో ద‌బిడి దిబిడి ఆడేస్తున్న తీరు ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.