మృనల్ మతిపోగొట్టేసిందిగా.. గ్లామర్ తో స్టన్నింగ్

Tue Feb 07 2023 19:07:48 GMT+0530 (India Standard Time)

Selfiee song Kudiyee Ni Teri teaser mrunal thakur

అక్షయ్ కుమార్ హీరోగా సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వస్తున్న మూవీ సెల్ఫీ. ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కాబోతుంది. అక్షయ్ తీసిన గత నాలుగు సినిమాలు ఫ్యాన్ సినీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో సెల్ఫీ సినిమాతో వస్తున్నాడు అక్షయ్. ఆల్రెడీ హిట్ కొట్టిన సినిమా కథనే తీసుకుని రీమేక్ చేసి హిట్ కొట్టాలని ఫిక్స్ అయి సెల్ఫీ సినిమా తీశాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాకి రీమేక్ గా సెల్ఫీ సినిమా వస్తోంది. ఇందులో అక్షయ్ కుమార్ తో పాటు ఇమ్రాన్ హష్మీ కూడా కనిపించనున్నాడు.సెల్ఫీ మూవీ ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో కుడియే ని తేరి పాటను టీజర్ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో మృణాల్ ఠాకూర్ అందాల విందు మామూలుగా లేదు. బ్లాక్ టైప్ అదే కలర్ పొట్టి షార్ట్ లో వింటేజ్ తరహా గ్లాసెస్ ధరించి మృణాల్ అలా నడుస్తుంటే.. ఇలా కుర్రాళ్లు తమ హార్ట్ లను ఇచ్చేస్తున్నారు.

ఈ సాంగ్ లో ఈ బ్యూటీ అందాల ప్రదర్శన మరో రేంజ్ లో ఉండనున్నట్లు టీజర్ లో తెలుస్తోంది. కళ్లు బైర్లు కమ్మే క్లీవేజ్ షోతో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అలరిస్తూనే ఉంటుంది. ఈ సాంగ్ లో ఆ డోసు ఇంకాస్త పెంచినట్లుగా కనిపిస్తోంది. ఈ పూర్తి సాంగ్ ను ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు టీజర్ లో పేర్కొన్నారు. మృణాల్ రచ్చ ఏమేరకు ఉంటుందో చూసేయాలంటే గురువారం వరకూ ఆగాల్సిందే. కుడియే ని తేరి పాటను ది ప్రొఫెక్ జారా ఖాన్ కలిసి పాడారు.

డ్రైవింగ్ లైసెన్స్ సినిమాలో యాక్టర్ సూరజ్ వెండ్రమూడు నటించిన పోలీసు పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఇమ్రాన్ హష్మీ చాలా నేచురల్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా అతని కెరీర్ లో ఓ మైలు రాయిగా నిలిచే అవకాశం ఉంది. ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ స్టార్ హీరోకి మధ్య జరిగిన ఇగో ఇష్యూ ఎంత దూరం వెళ్లింది అనే కథను చాలా బాగా చూపించారు డ్రైవింగ్ లైసెన్స్ లో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.