Begin typing your search above and press return to search.

సర్కారు వారి పాటతోనూ మైండ్‌ బ్లాంక్‌ చేయబోతున్నాడు

By:  Tupaki Desk   |   30 Sep 2020 2:30 AM GMT
సర్కారు వారి పాటతోనూ మైండ్‌ బ్లాంక్‌ చేయబోతున్నాడు
X
టాలీవుడ్‌ హీరోల్లో బెస్ట్‌ డాన్సర్‌ జాబితాలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఎప్పుడు కింది వరుసలో ఉంటాడు. యాక్టింగ్‌ లో యాక్షన్‌ లో సూపర్‌ స్టార్‌ అయినా కూడా మహేష్‌ బాబు డాన్స్‌ లో కాస్త వీక్‌ అనేది అభిమానులు కూడా అనధికారికంగా ఒప్పుకుంటారు. అలాంటిది సరిలేరు నీకెవ్వరు సినిమాలో మైండ్‌ బ్లాంక్‌ పాటతో అభిమానులకు మరియు ప్రేక్షకులకు మహేష్‌ బాబు నిజంగానే మైండ్‌ బ్లాంక్‌ చేశాడు. తన మాస్‌ స్టెప్పులతో సినిమాకు మంచి ఊపు తీసుకు వచ్చాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా మాదిరిగానే సర్కారు వారి పాట సినిమాలో కూడా అలాంటి మాస్‌ స్టెప్‌ లు వేయబోతున్నాడట.

సరిలేరు నీకెవ్వరు సినిమాలోని మైండ్‌ బ్లాంక్‌ పాటకు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు. ఆ పాటకు వచ్చిన పాజిటివ్‌ స్పందన కారణంగా సర్కారు వారి పాట సినిమాలో కూడా శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో ఒక పాటను ప్లాన్‌ చేస్తున్నారట. థమన్‌ అందుకోసం ఒక మాస్‌ బిట్‌ ను ట్యూన్‌ చేయబోతున్నాడు. మహేష్‌ బాబు ఇకపై డాన్స్‌ ల విషయంలో ఎక్కువ శ్రద్ద పెట్టాలనుకున్నాడట. అందుకే ఈసారి కూడా ఆయనతో మాస్‌ స్టెప్పులు వేయబోతున్నాడు. ఈ సినిమాలో మహేష్‌ బాబుకు జోడీగా కీర్తి సురేష్‌ నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.