Begin typing your search above and press return to search.

సైలెంట్ ట్రీట్‌! ధ‌నుష్ తో శేఖ‌ర్ క‌మ్ముల త్రిభాషా చిత్రం!!

By:  Tupaki Desk   |   18 Jun 2021 4:33 AM GMT
సైలెంట్ ట్రీట్‌! ధ‌నుష్ తో శేఖ‌ర్ క‌మ్ముల త్రిభాషా చిత్రం!!
X
కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ధ‌నుష్ ఖ్యాతి విశ్వ‌విఖ్యాతం అయిన ఇలాంటి క్రేజీ స‌మ‌యంలో టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల అత‌డితో ఓ త్రిభాషా చిత్రానికి రూప‌క‌ల్ప‌న చేయడం షాకింగ్ స‌ర్ ప్రైజ్ అనే చెప్పాలి. ఈ క్రేజీ మూవీకి నారాయణ్ దాస్ కె నారంగ్ -పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మాత‌లు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యాన‌ర్ లో త్రిభాషా చిత్రంగా తెర‌కెక్క‌నుంది. దివంగత సునీతా నారంగ్ పుట్టినరోజు సందర్భంగా నేడు ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాన్ని సోనాలి నారంగ్ ప్ర‌క‌టించారు.

ఓవైపు ధ‌నుష్ త‌న తాజా చిత్రం జ‌గ‌మే తంత్రం (జ‌గ‌మే తందిరం-త‌మిళ్) రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అవెంజ‌ర్స్ ద‌ర్శ‌కులు రస్సో బ్ర‌ద‌ర్స్ తో `ది గ్రేమ్యాన్` అనే చిత్రంలోనూ న‌టిస్తూ ఆకాశ‌మే హ‌ద్దుగా దూసుకెళుతున్నారు. ఇంత‌కుముందే జ‌గ‌మే తంత్రం నెట్ ఫ్లిక్స్ రిలీజ్ సంద‌ర్భంగా ర‌స్సో బ్ర‌ద‌ర్స్ అత‌డికి శుభాకాంక్ష‌లు చెప్ప‌డం అభిమానుల‌ను స‌ర్ ప్రైజ్ చేసింది.

అంత పెద్ద క్రేజీ స్టార్ తో స‌డెన్ స‌ర్ ప్రైజ్ ని ప్ర‌క‌టించారు క‌మ్ముల - నారంగ్ బృందం. ఇన్నాళ్లు త‌న‌వైన సెన్సిబుల్ క‌థాంశాల‌తో ల‌వ్ స్టోరీస్ తో క‌మ్ముల ప్ర‌త్యేక ఒర‌వ‌డి సృష్టించి ఇప్పుడు ధ‌నుష్ లాంటి ఇంట‌ర్నేష‌న‌ల్ క్రేజీ స్టార్ తో ఎలాంటి సినిమా తీయ‌బోతున్నారు? అన్న ఉత్కంఠ ఇప్పుడు అభిమానుల్ని నిల‌వ‌నీయ‌ద‌న‌డంలో సందేహ‌మేం లేదు.

ధ‌నుష్‌ బహుముఖ ప్రజ్ఞ .. నటనతో పాత్ బ్రేకింగ్ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు అందుకుంటున్న ఇలాంటి క్రేజీ టైమ్ లో క‌మ్ముల ప్లాన్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తెలుగు-తమిళ - హిందీ భాషలలో ఒకేసారి ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి (ఎ యూనిట్ ఆఫ్ ఏషియన్ గ్రూప్) ప్రొడక్షన్ నం 4 అత్యంత భారీగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఆసియా గ్రూప్ - ఫిల్మ్ ఎగ్జిబిషన్ .. డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లో ఒక పురాణ బ్రాండ్ కొన్ని అద్భుతమైన కంటెంట్-ఆధారిత చిత్రాలను రూపొందిస్తోంది. ఇప్పుడు పాన్-ఇండియా మార్కెట్లను లక్ష్యంగా వ‌రుస చిత్రాల్ని చేయ‌నుంద‌ని నిర్మాత‌లు తెలిపారు. ఈ బృందం వివిధ భాషల స్టార్లు.. అత్యున్నత సాంకేతిక బృందంతో చర్చలు జరుపుతోంది. త్వరలో వివ‌రాల్ని వెల్ల‌డించ‌నున్నారు.