Begin typing your search above and press return to search.
మరోసారి ఆ దర్శకుడితో నాగ చైతన్య?
By: Tupaki Desk | 5 Feb 2023 6:00 PMఅక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య గత ఏడాది థాంక్యూ అనే సినిమా చేసి డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ కనీసం పెట్టిన పెట్టుబడిలో సగం కూడా కలెక్ట్ చేయలేదనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే సినిమాని చైతన్య చేస్తున్నాడు. ఈ మూవీ డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతుంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాగ చైతన్య నటిస్తున్నాడు. అయితే పోలీస్ ఆఫీసర్ గా ఉన్న చైతన్య ఎందుకు కస్టడీ ఖైదీగా మారాడు అనే ఎలిమెంట్ తో ఈ మూవీ కథాంశం ఉండబోతుంది అని టాక్.
ఇక ఈ సినిమాలో కృతి శెట్టి కూడా ఇంటరెస్టింగ్ పాత్రలో కనిపిస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ లా కాకుండా కథలో చాలా కీలకమైన పాత్రని ఆమె పోషిస్తుంది అని తెలుస్తుంది. వెంకట్ ప్రభు సినిమాలు అంటే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కి దూరంగా ఉంటాయి. ఈ నేపధ్యంలోనే అతని దర్శకత్వంలో చైతన్య చేస్తున్న సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. కచ్చితంగా సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తుంది.
థాంక్యూ కంటే ముందుగా లవ్ స్టొరీ అనే సినిమాతో నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా తెరకెక్కిన ఈ సినిమా ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ తో తెరకెక్కింది. కులాల అంతరం ఉన్న అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమని శేఖర్ కమ్ముల తనదైన స్టైల్ లో తెరకెక్కించి హిట్ కొట్టారు.ఇదిలా ఉంటే కస్టడీ మూవీ తర్వాత నాగ చైతన్య మరోసారి శేఖర్ కమ్ములతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుతెలుస్తుంది.
శేఖర్ కమ్ముల ప్రస్తుతం తమిళ్ హీరో ధనుష్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం ధనుష్ సార్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. అలాగే కెప్టెన్ మిల్లర్ అనే పాన్ ఇండియా మూవీ షూటింగ్ దశలో ఉంది. అది కంప్లీట్ అయ్యాక శేఖర్ కమ్ముల సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడు. ఇక ధనుష్ మూవీని కంప్లీట్ చేసాక శేఖర్ కమ్ముల నాగ చైతన్యతో సినిమా చేయనున్నట్లుతెలుస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.