శేఖర్ కమ్ముల ... ఫస్ట్ టైం

Tue Sep 10 2019 11:00:01 GMT+0530 (IST)

Sekhar Kammula And Naga Chaitanya Movie Announcement

కొందరు దర్శకులు సైలెంట్ గా సినిమా మొదలెట్టేసి రిలీజ్ కి ముందు కొద్దిగా ప్రమోషన్ చేసి కంటెంట్ తో ఎట్రాక్ట్ చేస్తారు. ఈ లిస్టులో శేఖర్ కమ్ముల ముందుంటాడు. నిజానికి ఈ డైరెక్టర్ ఎప్పుడు షూటింగ్ చేస్తాడో.. ఎప్పుడు సినిమాను రిలీజ్ కి రెడీ చేస్తాడో ఎవరికీ తెలియదు. అదీ ఈయక స్టైల్. 'ఆనంద్' సినిమా నుండి మొన్నటి 'ఫిదా' వరకూ ఇదే స్టైల్ ను ఫాలో అయ్యాడు కూడా.అయితే ఇప్పుడు చేయబోయే సినిమా దీనికి వినూత్నంగా ఉంది. అనౌన్స్ మెంట్ నుండే సినిమాను ప్రమోట్ చేస్తూ హైప్ క్రియేట్ చేస్తూ వస్తున్నాడు శేఖర్ కమ్ముల. లేటెస్ట్ గా షూటింగ్ స్టార్ట్ అంటూ మీడియాకి న్యూస్ కూడా వదిలారు. ఇవన్నీ చూస్తే ప్రస్తుతం ఈ సాఫ్ట్ డైరెక్టర్ లో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

'ఫిదా' తర్వాత కొత్తవాళ్ళతో సినిమా మొదలెట్టి దాదాపు ఫినిషింగ్ స్టేజికి వచ్చాక ఆ సినిమాను పక్కన పెట్టి ఇప్పుడు అదే కథను కొన్ని మార్పులు చేసి సినిమా చేస్తునాడు శేఖర్ కమ్ముల. అయితే శేఖర్ కమ్ముల చేసిన ఏ సినిమాకు లేని అంచనాలు ఈ సినిమాపై మొదలయ్యాయి. దీనికి రీజన్ 'ఫిదా'తో ఫిదా చేసేసిన సాయి పల్లవి  - అక్కినేని హీరో చైతన్య కాంబినేషన్. పైగా 'ఫిదా' లాంటి సూపర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల నుండి వస్తున్న సినిమా. అందుకే ఈ సినిమాపై ఇప్పుడు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మరి కెరీర్ లో ఫస్ట్ అనౌన్స్ మెంట్ నుండే అంచనాలు నెలకొల్పిన ఈ క్లాస్ డైరెక్టర్ వాటిని అందుకుంటాడా ..లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.