Begin typing your search above and press return to search.

అలరిస్తోన్న 'సెహరి' టైటిల్ సాంగ్..!

By:  Tupaki Desk   |   7 Jun 2021 8:50 AM GMT
అలరిస్తోన్న సెహరి టైటిల్ సాంగ్..!
X
హర్ష కనుమల్లి - సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ "సెహరి'. జ్ఞాన సాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ - ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. వ్యూహాత్మకంగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిత్ర బృందం.. తాజాగా 'సెహరి' టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేసింది.

'కచడ కచడా హోగయా.. అర్థమైతలేదయా.. అచ్చట ముచ్చట లేదయా.. వసపడతలే ఏందయ్యా' అంటూ సాగిన ఈ సాంగ్ కు ప్రశాంత్ ఆర్ విహారీ ట్యూన్ సమకూర్చారు. చౌరస్తా రామ్‌ మిరియాల ఈ పాటను తనదైన శైలిలో హుషారుగా ఆలపించారు. 'ఏసిన పెగ్గు వేస్తా ఉన్నా కిక్కే వస్త లేదే.. అందరి నసీబ్ రాసినోడు నన్నే దేకలేదే' అంటూ లిరిసిస్ట్ భాస్కర భట్ల యూత్ ని ఆకట్టుకునేలా సాహిత్యం అందించారు. యష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ లో హర్ష కనుమల్లి వేసిన స్టెప్స్ అలరిస్తున్నాయి.

'సెహరి' చిత్రానికి హీరో హర్ష కనుమల్లి కథ అందిస్తుండటం విశేషం. దీనికి అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. రవితేజ గిరజాల ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇందులో అభినవ్ గోమఠం - ప్రణీత్ రెడ్డి - అనిషా అల్లా - అక్షిత హరీష్ - సంగీత దర్శకుడు కోటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విర్గో పిక్చర్స్ బ్యానర్ పై అద్వయ జిష్ణు రెడ్డి - శిల్పా చౌదరి సంయుక్తంగా ఈ రోమ్ కామ్ ని నిర్మిస్తున్నారు. త్వరలోనే 'సెహరి' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.