Begin typing your search above and press return to search.

రానాకు కితాబిచ్చిన హాటు ముంబై పాప!

By:  Tupaki Desk   |   20 Feb 2020 7:29 AM GMT
రానాకు కితాబిచ్చిన హాటు ముంబై పాప!
X
తెలుగులోనే కాకుండా ఇతర భాషా చిత్రాల్లో నటించి గుర్తింపు సాధించిన తెలుగు హీరోలలో రానా దగ్గుబాటి ఒకరు. తమిళం.. హిందీ సినిమాల్లో నటిస్తూ అక్కడివారికి చేరువయ్యాడు. ఇక 'బాహుబలి' ఫ్రాంచైజీ ఘన విజయంతో రానా పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఇక రానాకు ఫ్రెండ్స్ ఎక్కువే.. టాలీవుడ్ లోనే కాదు.. కోలీవుడ్.. బాలీవుడ్ ఇలా అన్ని వుడ్డులలో లెక్కలేనంత మంది స్నేహితులు. అలాంటి ఫ్రెండ్స్ లో హీరోయిన్ సీరత్ కపూర్ కూడా ఉందట.

సీరత్ కపూర్ తెలుసు కదా.. ఈ ముంబై భామ 'రన్ రాజా రన్'..'టైగర్'.. 'కొలంబస్'.. 'రాజుగారి గది 2'.. 'ఒక్క క్షణం'.. 'టచ్ చేసి చూడు' సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం 'కృష్ణ అండ్ హిజ్ లీల' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను రానా దగ్గుబాటి సమర్పిస్తున్నాడు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ రానా టాపిక్ వచ్చినప్పుడు "రానా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. రానాను పైకి అలా చూసి ఏదో అనుకుంటారు కానీ చాలా సున్నితమైన మనస్తత్వం" అంటూ కితాబిచ్చింది. నిజమే రానా హైటు.. ఆ గడ్డం.. ఆ కండలు తిరిగిన శరీరం చూస్తే ఎవరైనా రఫ్ అండ్ టఫ్ అనుకుంటారు. మరి ఈ సీరత్ ఏంటో రఫ్ఫు టఫ్ఫు కాకుండా వెన్నలాంటి మనసు అంటోంది. సరే.. ముంబై పాప చెప్తోంది కాబట్టి ఎవరైనా నమ్మాల్సిందే.

ఇక 'కృష్ణ అండ్ హిజ్ లీల' సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ "ఈ సినిమాలో రుఖ్సార్ అనే పాత్ర పోషిస్తున్నాను. తను స్వంతంత్రంగా ఉండే అమ్మాయి. చాలా తెలివైనది.. పరిణతో కూడిన తన మాటలకు గ్రూప్ లో ఎవరైనా నోరు ముయ్యాల్సిందే" అంటూ కాస్త ఆవేశంగా చెప్పుకొచ్చింది. పాప ఊపు చూస్తుంటే మన దూల నోరు కూడా క్షణాల్లో మూయించేలా ఉందే!!