Begin typing your search above and press return to search.

కాస్టింగ్ కౌచ్ అరుపులతో అల్ల‌రి పాల‌వ్వ‌డం త‌ప్ప ఏం ప్ర‌యోజ‌నం?

By:  Tupaki Desk   |   28 Sep 2020 8:50 AM GMT
కాస్టింగ్ కౌచ్ అరుపులతో అల్ల‌రి పాల‌వ్వ‌డం త‌ప్ప ఏం ప్ర‌యోజ‌నం?
X
కాస్టింగ్ కౌచ్ వివాదం బాలీవుడ్ ‌ని ఓ ఊపు ఊపేస్తున్న‌ విష‌యం తెలిసిందే. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ని కూడా దీని ప్ర‌కంప‌న‌లు తాకాయి. చాలా మంది మీటూ ప్ర‌భావం త‌మ‌పై వుంద‌ని.. త‌మ‌కు ఎదురైన చేదు సంఘ‌ట‌న‌ల్ని బ‌య‌ట‌పెట్టారు. కొంత మంది ప్ర‌తిచోటా కాస్టింగ్ కౌచ్ వుంద‌ని చెప్పుకొచ్చారు. సీర‌త్ క‌పూర్ కూడా దీనిపై తాజాగా స్పందించింది. అయితే ఈ అమ్మ‌డు అందరికి భిన్నంగా స్పందించ‌డ‌మే ఆస‌క్తిక‌రంగా మారింది.

కాస్టింగ్ కౌచ్ ప్ర‌తిచోటా వుంద‌ని అయితే దాని గురించి ఎలా బ‌య‌ట‌ప‌డ‌గ‌లం.. దాని గురించి మ‌నం ఏం నేర్చుకున్నాం అన్న‌ది ఇంపార్టెంట్ అంటోంది. కాస్టింగ్ కౌచ్ జ‌రిగింద‌ని అర‌వ‌డం వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం లేద‌ని నా ఉద్దేశం. దాని నుంచి మ‌నం ఏదైనా నేర్చుకుంటే మ‌రింత స్ట్రాంగ్ అవుతాం. అది కెరీర్ కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఇక కాస్టింగ్ కౌచ్ బారిన ఎలా ప‌డ్డాం? అని కాకుండా ఎలా దాని బారి నుంచి త‌ప్పించుకున్నాం అన్న‌ది చెబితే బాగుంటుంది. దీనిపై ఆరోప‌ణ‌లు చేసినంత మాత్రాన జ‌రిగేది ఏమీ వుండ‌దు అల్ల‌రి పాలు కావ‌డం త‌ప్ప అంటూ త‌న‌దైన స్టైల్లో విశ్లేషించింది.