రకుల్ ప్రీత్ సింగ్ షూటింగ్ పై రాళ్లదాడి

Tue Feb 23 2021 07:00:01 GMT+0530 (IST)

Security personnel were beaten and Rakul Preet was stoned on the shooting

టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సినిమా షూటింగ్ పై కొందరు దాడి చేశారు. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంతో కలిసి రకుల్ నటిస్తున్న 'ఎటాక్' చిత్రం షూటింగ్ ధనిపూర్ లో జరుగుతోంది. షూటింగ్ సందర్భంగా కొందరి దాడితో ఉద్రిక్తంగా మారింది.జాన్ అబ్రహం రకుల్ జంటగా లక్ష్యరాజ్ దర్శకత్వంలో 'ఎటాక్' చిత్రం రూపొందుతోంది. ఆగస్టు 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ధనీపూర్ లో షూటింగ్ సందర్భంగా స్థానికులు భారీగా తరలివచ్చారు. వారిని రాకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.

ఈ క్రమంలోనే స్థానికులకు సెక్యూరిటీ సిబ్బందికి వాగ్వాదం గొడవ జరిగింది. ఈ క్రమంలోనే స్థానికులు రాళ్లతో సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. పోలీసులు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దు మణిగింది.అనంతరం పోలీసుల భద్రత మధ్య సినిమా షూటింగ్ జరిగింది. ఈ రాళ్ల దాడిలో సెక్యూరిటీ సిబ్బంది గాయపడగా.. హీరో జాన్ అబ్రహం హీరోయిన్ రకుల్ కు ఎటువంటి గాయాలు కాలేదు.