Begin typing your search above and press return to search.

రెండవ 'సరైనోడు' కన్ఫ్యూజన్‌ కంటిన్యూ!

By:  Tupaki Desk   |   14 Oct 2021 7:30 AM GMT
రెండవ సరైనోడు కన్ఫ్యూజన్‌ కంటిన్యూ!
X
అల్లు అర్జున్‌ హీరోగా ప్రస్తుతం పుష్ప రూపొందుతున్న విషయం తెల్సిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప రెండు పార్ట్‌ లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటి పార్ట్‌ ను డిసెంబర్‌ లో విడుదల చేయబోతున్నారు. రెండవ పార్ట్‌ కు ఒక ఏడాది గ్యాప్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందుకు గాను పుష్ప పార్ట్‌ 1 తర్వాత వేరే సినిమాను బన్నీ చేస్తాడని టాక్ వినిపిస్తుంది. మొన్నటి వరకు ఐకాన్‌ ను బన్నీ ఆ గ్యాప్ లో చేస్తాడని.. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత నుండి మళ్లీ పుష్ప 2 ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బన్నీ.. బోయపాటి కాంబో మూవీ కూడా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయట. వీరిద్దరి కాంబోలో అయిదేళ్ల క్రితం సరైనోడు వచ్చిన విషయం తెల్సిందే. అప్పటి వరకు చూడని భారీ విజయాన్ని బన్నీ ఆ సమయంలో దక్కించుకున్నాడు. అందుకే బోయపాటితో మరోసారి సినిమాను చేయాలని బన్నీ భావిస్తున్నాడట.

బోయపాటితో మరోసారి సరైనోడు రేంజ్ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్ ను బన్నీ చేస్తాడని చాలా నెలలుగా ప్రచారం జరుగుతోంది. కాని ఇప్పటి వరకు ఆ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. పుష్ప సినిమా తర్వాత బన్నీ చేయబోతున్న మూవీ బోయపాటితోనా లేదా వేణు శ్రీరామ్‌ తో ఐకాన్ సినిమాను చేస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బోయపాటితో పాటు కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కూడా బన్నీ సినిమా చేయాల్సి ఉంది. ఇంకా కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ప్రకటించారు. అది కొన్ని కారణాల వల్ల ప్రస్తుతానికి క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు కాకున్నా కొన్నాళ్లకు అయినా మళ్లీ ఆ సినిమా ను తెరపైకి తీసుకు వచ్చేలా ఇద్దరు ఒప్పందంతోనే ప్రస్తుతానికి పక్కకు పెట్టారని టాక్ వినిపిస్తుంది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమా మాస్ మసాలా మూవీగా నిలిచి బన్నీ కెరీర్ లోనే ఒక మంచి సినిమాగా నిలిచింది. అలాంటి సినిమానే మళ్లీ బన్నీ కోరుకుంటున్నాడు. బోయపాటి ఇప్పటికే కథను కూడా రెడీ చేశాడని.. ఇద్దరి కాంబోలో మరో సినిమా దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. కాని అది ఎప్పుడు పట్టాలెక్కబోతుంది.. అసలు ఎప్పటికి అధికారిక ప్రకటన వస్తుంది అనేది ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ క్రియేట్‌ చేస్తోంది. అభిమానులు కూడా రెండవ సరైనోడు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం పుష్ప మారు మ్రోగి పోతుంది. బన్నీ కెరీర్ లోనే కాకుండా ఇండస్ట్రీ చరిత్రలో కూడా రికార్డు వసూళ్లు సాధిస్తుందని.. నాన్‌ బాహుబలి రికార్డును పాన్ ఇండియా రికార్డును దక్కించుకుంటుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.