స్క్రిప్టే కీలకం.. 500 కోట్ల క్లబ్ పఠాన్ పై డైరెక్టర్ వ్యాఖ్య

Tue Jan 31 2023 10:08:24 GMT+0530 (India Standard Time)

Script is key.. Director's comment on 500 crore Club Pathan

బాలీవుడ్ చాలా కాలంగా వేచి చూసిన విజయం ఇన్నాళ్టికి  దక్కింది. అది కింగ్ ఖాన్ 'పఠాన్'తో సాధ్యమైంది. పఠాన్ బ్లాక్ బస్టర్ విజయంతో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. అతడిలో జోష్ మునుపటి కంటే రెట్టింపైంది. వార్- పఠాన్ సినిమాలతో వరుస విజయాలు అందుకుని అతడు దూకుడుమీదున్నాడు. అతడు మునుముందు రానున్న ఇండియన్ సినిమాలకు కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేయాలని కసిగా ఉన్నానని తెలిపాడు.



స్పై థ్రిల్లర్ కంటెంట్ తో వచ్చిన సరైన చిత్రమిదని పఠాన్ ఫలితంపై బాలీవుడ్ ఊరట చెందుతోంది. ఇది షారూఖ్ ఖాన్ కి నాలుగు సంవత్సరాల తర్వాత దక్కిన ఘనమైన విజయం. ఖాన్ అభిమానుల ఆకలిని తీర్చడంలో సిద్ధార్థ్ సఫలమయ్యాడు. సినిమాను బ్లాక్ బస్టర్గా మార్చాడు.

అయితే తాజా విజయానికి కారణం తాను ఎంపిక చేసుకున్న స్క్రిప్టు  అని అతడు బలంగా చెప్పాడు. నమ్మశక్యం కాని విజయంతో ఆనందంలో మునిగిపోయానని అన్నాడు. తదుపరి చరిత్ర(హిస్టరీ)పైనా ఒక అద్భుతమైన స్క్రిప్టును రెడీ చేస్తున్నానని చెప్పాడు.

సిద్ధార్థ్ పఠాన్ విజయంతో ప్రేరణ పొందాడు. మళ్లీ సెట్పైకి వెళితే కచ్ఛితంగా ప్రేక్షకుల కోసం నిజంగా ప్రత్యేకమైన సినిమాని సృష్టించాలని ఎదురుచూస్తున్నాడు. ఈ సందర్భంగా స్క్రిప్టు పనితనం గురించి అతడు ప్రత్యేకించి ప్రస్థావించాడు.

సిద్ధార్థ్ ఆనంద్ కొత్త రికార్డుల గురించి మాట్లాడుతూ-"స్క్రిప్టింగ్ చరిత్ర.. ప్రతి ఒక్కరూ స్క్రిప్టును గొప్పగా చేయాలని కోరుకుంటారు. కానీ ఒక్కరిగా దానిని ప్లాన్ చేయలేరు. ఇది కొందరితో జరిగే ప్రక్రియ. ఇది నిజంగా చాలా సంతోషకరమైన అనుభవం" అని తెలిపాడు. వార్- పఠాన్ చిత్రాలతో హిందీ చిత్ర పరిశ్రమకు పాన్ ఇండియా అప్పీల్ ను తేవడంలో అతడు సక్సెసయ్యాడు.

ఇక పఠాన్ సక్సెస్ వెనక కథా బలంతో పాటు.. ఎమోషన్ అందరికీ కనెక్టయిందని అతడు తెలిపాడు. "సినిమా అనేది ఎమోషన్ కు సంబంధించినది... భాష తో పని లేదని ఎప్పుడూ నమ్ముతాను. కథలో ఎమోషన్ ఒక్కటే ఉత్కంఠభరితమైన హైట్స్ కు తీసుకెళుతుంది. పఠాన్ తో ఇది సాధ్యమైంది.." అని అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా మన ప్రజలను పఠాన్ అలరించడం భారతదేశానికి ఒక ఉత్తేజకరమైన దశ. .. అని కూడా అతడు ఆనందం వ్యక్తం చేసాడు.

పఠాన్ తో SRK తన సొంత సినిమాల రికార్డులను అధిగమించడమే కాదు తన కొత్త బెంచ్ మార్క్ రికార్డును నెలకొల్పాడు. ఈ చిత్రం విడుదల రోజున 55 కోట్ల వసూళ్లు రాబట్టి హిందీ చిత్రసీమలో ఇప్పటి వరకు అతిపెద్ద ఓపెనర్ గా నమోదైంది.

సిద్ధార్థ్ ఆనంద్ కెరీర్ మ్యాటర్ కి వస్తే.. తదుపరి హృతిక్ రోషన్ - దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో ఫైటర్ సెట్స్ పై ఉంది.  మైత్రీ మూవీ మేకర్స్- ప్రభాస్ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా సినిమాని అతడు తెరకెక్కించనున్నాడని కథనాలొచ్చాయి.  ఇప్పటికే ముల్క్ నిర్మాత దీపక్ ముకుత్ తో ఒక చిత్రానికి సంతకం చేశాడు.

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా స్పై యూనివర్స్ లో పఠాన్ భాగం. కాబట్టి నిర్మాణ సంస్థ ఏక్ థా టైగర్- టైగర్ జిందా హై- వార్ ని ఈ విభాగంలో విడుదల చేసింది. వీటన్నిటికీ సీక్వెల్స్ కొనసాగుతాయి. వార్ సీక్వెల్ మళ్లీ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.