ఓవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీసులు.. జోరుమీదున్న టాలెంటెడ్ హీరో..!

Sat Jul 24 2021 11:45:20 GMT+0530 (IST)

Satyadev is one of the busy heroes in Tollywood right now

ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోలలో సత్యదేవ్ ఒకరు. వైవిధ్యమైన కథలు విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ వస్తున్న టాలెంటెడ్ యాక్టర్ చేతిలో ఇప్పుడు ఐదారు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన సత్యదేవ్.. ఇప్పుడు దర్శకులు అతన్ని దృష్టిలో పెట్టుకొని కథలు రాసుకునే స్థాయికి చేరుకున్నాడు. తమిళ హీరోలకు తెలుగు డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసిన సత్య.. ఓటీటీ వరల్డ్ లో కూడా సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సత్యదేవ్ లీడ్ రోల్ లో రూపొందిన 'లాక్డ్' సిరీస్ కు సీక్వెల్ రెడీ అవుతోంది.తెలుగు ఓటీటీ 'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతున్న థిల్లర్ వెబ్ సిరీస్ ''లాక్డ్''. దర్శకుడు ప్రదీప్ దేవకుమార్ రూపొందించిన ఈ సిరీస్ లో సత్యదేవ్ తో పాటు సంయుక్త - శ్రీలక్ష్మి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. న్యూరో స్పెషలిస్ట్ చుట్టూ తిరిగే కథాంశంతో ఉత్కంఠ భరితంగా తీర్చిదిద్దిన ఈ సిరీస్ మంచి ఆదరణ దక్కించుకుంది. తెలుగులో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ లలో ఒకటిగా నిలిచిన ఈ సిరీస్ కు కొనసాగింపుగా ''లాక్డ్ 2'' రాబోతున్నట్లు 'ఆహా' ఓటీటీ అధికారికంగా ప్రకటించింది.

తెలుగులో సినిమాలకు సీక్వెల్స్ వచ్చాయి కానీ ఇంతవరకు వెబ్ సిరీస్ కు సీక్వెల్ రాలేదు. సత్యదేవ్ తో రూపొందించే 'లాక్డ్ 2' మొదటిది అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన 'తిమ్మరుసు' చిత్రం జూలై 30న థియేటర్లలోకి రానుంది. ఇక 'బ్లఫ్ మాస్టర్' ఫేమ్ గోపిగణేశ్ పట్టాభి దర్శకత్వంలో 'గాడ్సే' అనే మరో వైవిధ్యమైన సినిమా చేస్తున్నాడు. అలానే స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తో కలసి 'గుర్తుందా శీతాకాలం' అనే సినిమాలో నటిస్తున్నాడు సత్యదేవ్.

ఇదే క్రమంలో వీవీ గోపాలకృష్ణ అనే కొత్త దర్శకుడితో 'భగవద్గీత సాక్షిగా' చిత్రాన్ని అనౌన్స్ చేసిన సత్యదేవ్.. అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న 'రామ్ సేతు' చిత్రంలో కీలక పాత్ర చేయనున్నాడని సమాచారం. ఇప్పుడు ఆహా ఓటీటీ కోసం 'లాక్డ్' రెండో సీజన్ కూడా మొదలు పెట్టనున్నారు. ఏదేమైనా ఖాళీగా లేకుండా ఏడాది పొడవునా బిజీగా ఉంటున్న సత్యదేవ్ ప్యాషన్ ని మెచ్చుకొని తీరాల్సిందే.