సుప్రీం నోట 'సర్కారు వారి పాట' లాంటి తీర్పు

Fri May 13 2022 17:00:05 GMT+0530 (IST)

Sarkaru vaari paata movie news

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ ఎంటర్ టైనర్ `సర్కారు వారి పాట` ఈ గురువారం వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో మైత్రీ మూవీ మేకర్స్ 14 ప్లస్ రీల్స్ జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాయి. మహేష్ నుంచి దాదాపు రెండేళ్ల విరామం తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం భారీ అంచానల మధ్య విడుదలైంది. అయితే తొలి రోజు మాత్రం ఈ చిత్రానికి మిశ్రమ స్పందనే లభించింది.ఆశించిన దానికి తగ్గట్టుగా సినిమా లేదని కథ కథనాలపై దర్శకుడు మరింత పట్టుబిగిస్తే బాగుండేదని కామెంట్ లు మొదలయ్యాయి. అయితే సినిమా మాత్రం టాక్ కు సంబంధం లేకుండా యుఎస్ బాక్సాఫీస్ వద్ద ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతోంది. అంతే కాకుండా ప్రారంభ వసూళ్లలో ఆల్ టైమ్ రికార్డుని సృష్టంచింది. తొలి రోజే వరల్డ్ వైడ్ గా అత్యధిక వసూళ్లని రాబట్టిన ప్రాంతీయ చిత్రంగా 75 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది.

యుఎస్ మార్కెట్ లోనూ ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లని రాబట్టడం విశేషం. `పోకిరి` తరువాత ఆ స్థాయికి మించిన పాత్రలో చాలా జోవియల్ గా మహేష్ పాత్రని ఆవిష్కరించిన తీరు తను చెప్పిన డైలాగ్స్ సాంగ్స్ కీర్తి సురేష్ - మహేష్ ల మధ్య కుదిరిన కెమిస్ట్రీ ప్రేక్షకులతో పాటు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. టాక్ కి కలెక్షన్ లకి సంబంధం లేకుండా ప్రేక్షకులు అభిమానుల్ని విశేషంగా అలరిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతోంది.

ఇదిలా వుంటే తాజా భారతీయ సర్వోన్నత న్యాయస్థానం `సర్కారు వారి పాట`కు జోష్ ని అందించింది.  ఈ చిత్రంలోని ప్రధాన ఉద్దేశ్యం సంపన్నులు సామాన్యుల పరంగా లోన్ రికవరీ విషయంలో ఎలాంటి తేడాని చూపించకూడదని ఇద్దరినీ ఒకేలా ట్రీట్ చేయాలని చూపించారు. ఇదే విషయాన్ని తాజాగా సుప్రీం కోర్టు తన తాజా తీర్పులో వెల్లడించింది. రైతుల నుంచి లోన్ లు రికవరీ చేయాలంటూ ఓ బ్యాంకు వేసిన పిటీషన్ ను సర్వోన్నత న్యాస్థానం తోసిపుచ్చింది.

ఈ సందర్భంగా సదరు బ్యాంక్ కు తన తీర్పుతో షాకిచ్చింది. అచ్చం `సర్కారు వారి పాట`లో చూపించిన విధంగానే `పెద్ద చేపలను పట్టుకున్న తరువాతే రైతుల జోలికి వెళ్లండి. ఇలాంటి పిటీషన్ ల వల్ల రైతుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతాయి` అని జస్టీస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో `సర్కారు వారి పాట` మేకర్స్ వైరల్ చేస్తున్నారు. తాజా తీర్పు తో `సర్కారు వారి పాట`కు మరింత జోష్ యాడయిందని అభిమానులు చెబుతున్నారు.