Begin typing your search above and press return to search.

టాక్ తో సంబంధం లేకుండా 'సర్కారు వారి పాట' రికార్డుల వేట..!

By:  Tupaki Desk   |   13 May 2022 10:39 AM GMT
టాక్ తో సంబంధం లేకుండా సర్కారు వారి పాట రికార్డుల వేట..!
X
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ''సర్కారు వారి పాట'' సినిమా భారీ అంచనాల నడుమ గురువారం వైరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయింది. పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయినప్పటికీ మహేష్ మూవీ టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టింది.

'సర్కారు వారి పాట' సినిమా ఓపెనింగ్ డే వసూళ్లలో ఆల్ టైమ్ రికార్డ్‌ ను సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ లెక్కల ప్రకారం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 75 కోట్ల గ్రాస్ వసూలు చేసి అత్యధిక వసూళ్లు అందుకున్న ప్రాంతీయ సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇది మహేశ్ కెరీర్ లో బెస్ట్ ఫిగర్ అని చెప్పాలి.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా రెస్టాఫ్ ఇండియా మరియు ఓవర్సీస్‌ లో కూడా 'సర్కారు వారి పాట' సినిమా మంచి వసూళ్లను సాధించింది. ఇప్పటికే USAలో ప్రీమియర్స్ కలుపుకొని $1.2 మిలియన్ మార్కును క్రాస్ చేసింది. దీంతో యూఎస్ మార్కెట్ లో ఏకంగా పదకొండు 1 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్ళు సాధించిన సినిమాలున్న ఏకైక స్టార్ గా మహేష్ బాబు నిలిచారు.

SVP మేకర్స్ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా లలో ఫస్ట్ డే 36.89 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తుంది. ఇది నాన్-RRR మొదటి రోజు ఆల్ టైం రికార్డ్ గా పేర్కొనబడింది. మరి రాబోయే రోజుల్లో ఈ నంబర్ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి. 'సర్కారు వారి పాట' ఏరియా వైజ్ డే-1 కలెక్షన్స్ వివరాలు...

నైజాం - 12.24 కోట్లు

సీడెడ్ - 4.7 కోట్లు

యూఏ - 3.73 కోట్లు

ఈస్ట్ - 3.25 కోట్లు

వెస్ట్ - 3.00 కోట్లు

గుంటూరు - 5.83 కోట్లు

కృష్ణ - 2.58 కోట్లు

నెల్లూరు - 1.56 కోట్లు

మొత్తం - 36.89 కోట్లు (షేర్)

కాగా, 'సర్కారు వారి పాట' చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఫస్టాఫ్ లో ఫన్నీ ఎలిమెంట్స్ తో కూడిన లవ్ ట్రాక్ - ఫైట్స్ - మహేష్ క్యారక్టరైజేషన్ - 'కళావతి' పాట - మహేష్ మాస్ డ్యాన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఆర్. మది సినిమాటోగ్రఫీ అందించారు. ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించగా.. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

SVP చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై రూపొందించారు. నవీన్ యెర్నేని - వై. రవిశంకర్ - రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట కలిసి సంయుక్తంగా నిర్మించాయి.