సర్కార్ వారి పాట AP- TS లో వసూళ్ల హవా

Fri May 13 2022 11:18:10 GMT+0530 (IST)

Sarkaru vaari paata movie collections AP TS

సూపర్ స్టార్ మహేష్  నటించిన `సర్కారు వారి పాట` ఈ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.  ఈ సినిమాకి మిశ్రమ స్పందనలు వ్యక్తమైనా ఓపెనింగుల్లో మహేష్ స్టార్ పవర్ వర్కవుటైంది.తొలి రోజు తొలి వీకెండ్ వసూళ్లకు డోఖా ఉండదని అంచనా వేస్తున్నారు. చాలా థియేటర్లలో ఆదివారం వరకు టిక్కెట్లు బ్లాక్ అయ్యాయన్న టాక్ ఉంది.

మహేష్ నటన డ్యాన్సులు ఎనర్జీ ప్రతిదీ అభిమానులకు కనెక్టవ్వడంతో తొలి వీకెండ్ థియేటర్ల ముందు మహేష్ అభిమానుల హవా సాగుతుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు AP - TS (ఇరు తెలుగు రాష్ట్రాల)లో 37 కోట్లు వసూలు చేసింది.

ఇది ఆల్ టైమ్ మహేష్ కి ఇది డే వన్ రికార్డ్. అనలిస్టుల వివరాల ప్రకారం.. సర్కార్ వారు మరో పెద్ద సినిమా విడుదలకు వచ్చే వరకూ హవా సాగిస్తారని అంచనా. ఇక సమ్మర్ సెలవులు కూడా ప్లస్ కానున్నాయి.

సర్కారు వారి పాట డే1 షేర్ వివరాలు పరిశీలిస్తే..నైజాం - 12.24 కోట్లు.. సీడెడ్ - 4.7 కోట్లు.. UA ప్రాంతం - 3.73 కోట్లు.. తూర్పు - 3.25 కోట్లు.. వెస్ట్ - 3 కోట్లు -గుంటూరు - 5.83 కోట్లు.. కృష్ణ - 2.58 కోట్లు..నెల్లూరు - 1.56 కోట్లు మొత్తం AP & TS డే1 షేర్: 37 కోట్లు గా ఉంది.