Begin typing your search above and press return to search.

`స‌ర్కార్ వారి పాట` ఒక్క రూపాయికేనా?

By:  Tupaki Desk   |   9 Aug 2020 3:49 AM GMT
`స‌ర్కార్ వారి పాట` ఒక్క రూపాయికేనా?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ స్క్రిప్టు ఎంపిక‌లో ఏమాత్రం రాజీకి రావ‌డం లేదు. సుకుమార్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ వినిపించిన స్క్రిప్టును వ‌దులుకుని ప‌ర‌శురామ్ స్క్రిప్టును ఓకే చేశారంటేనే అర్థం చేసుకోవ‌చ్చు. అందుకే ఈ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న `స‌ర్కార్ వారి పాట‌` చిత్రంపై అభిమానుల్లో ఓ రేంజులోనే అంచ‌నాలేర్ప‌డ్డాయి. గీత గోవిందం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని తెర‌కెక్కించిన ప‌ర‌శురామ్ స్టార్ హీరోతో త‌న డ్రీమ్ ని నెర‌వేర్చుకునే ప‌నిలో ఉన్నారు. త‌న ఫేవ‌రెట్ హీరో మ‌హేష్ తో సినిమాని వ‌దులుకునేందుకు ఎంత‌మాత్రం ఆస‌క్తిగా లేన‌ని చెప్పిన ప‌ర‌శురామ్ స‌ర్కార్ వారి పాట‌ స్క్రిప్టు విష‌యంలో ఎంత‌మాత్రం రాజీకి రాలేదు. లాక్ డౌన్ పీరియ‌డ్ లో ఈ సినిమాకి అద్దాల్సిన అన్ని మ‌సాలా అంశాల్ని ప‌క్కాగా ప్రిపేర్ చేశాడ‌ట‌.

ఇప్ప‌టికే స‌ర్కార్ వారి పాట క‌థాంశంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇందులో మ‌హేష్ పాత్ర‌లో స‌ర్ ప్రైజ్ ఉంటుంద‌ని అభిమానుల్లో చ‌ర్చ సాగుతోంది. ఇందులో ఈగ ఫేం సుదీప్ ఓ కీల‌క పాత్ర‌ను పోషించ‌నున్నాడు. ఇంత‌కుముందు రిలీజైన‌ మ‌హేష్ లుక్ కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. టోట‌ల్ పోస్ట‌ర్ లో ఎన్నో విష‌యాలు చెప్పాడు ప‌ర‌శురామ్. తాజాగా స‌ర్కార్ వారి పాట మోష‌న్ పోస్ట‌ర్ రిలీజైంది. ఈ పోస్ట‌ర్ టైటిల్ ని ట్విస్టు ప్ర‌తిబింబిస్తోంది. స‌ర్కార్ వారి పాట ఒక్క రూపాయి.. అనేది సింబాలిక్ గా చూపించారు. నేడు (ఆగ‌స్టు 9) మ‌హేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర‌బృందం ఇచ్చిన గిఫ్ట్ ఇది. ప్ర‌స్తుతం నెటిజ‌నుల్లో వైర‌ల్ గా మారింది.

ఇక ఈ సినిమా ఎలా ఉండ‌బోతోంది? అన్న‌ద చూస్తే .. ప‌ర‌శురామ్ ఈసారి త‌న జోన‌ర్ కి దూరంగా ఓ వెరైటీ క‌థాంశాన్ని ఎంచుకున్నాడ‌ట‌. త‌న‌కు బాగా అచ్చొచ్చిన లవ్ స్టోరీ చేస్తాడనకుంటే.. బ్యాంక్ మోసాల నేపథ్యంలో ఆద్యంతం థ్రిల్ల‌ర్ మోడ్ లో మూవీని చూపిస్తాడ‌ట‌. ఇందులో మ‌హేష్ త్రిపాత్రాభిన‌యం చేస్తాడ‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తెలుగు తెరపై రానీ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిస్తూ ఇరుగు పొరుగు భాష‌ల స్టార్ల‌తో కీల‌క పాత్ర‌లు చేయించ‌నున్నారు. క‌థానాయిక ఎవ‌రు? అన్న‌ది వెల్ల‌డించాల్సి ఉంది ఇంకా.