Begin typing your search above and press return to search.

'ఆచార్య' నేర్పిన పాఠం.. SVP కి తెలివిగా వ్యవహరించిన థియేటర్ చైన్స్..!

By:  Tupaki Desk   |   14 May 2022 2:30 AM GMT
ఆచార్య నేర్పిన పాఠం.. SVP కి తెలివిగా వ్యవహరించిన థియేటర్ చైన్స్..!
X
తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలం నుంచి థియేటర్ యాజమాన్యాలు టిక్కెట్ బ్లాకింగ్ సంస్కృతికి అలవాటు పడ్డారు. కొత్త సినిమాల విడుదల సమయంలో టిక్కెట్లను బ్లాక్ చేసి హోల్డ్ లో పెట్టి.. తరువాత వాటిని నేరుగా థియేటర్ కౌంటర్ లో అమ్మడానికి ఉపయోగిస్తుంటారు.

అయితే ఇటీవల రిలీజ్ అయిన 'ఆచార్య' సినిమా రిజల్ట్ చూసిన తర్వాత థియేటర్ యాజమాన్యాలు.. ఇప్పుడు ఈ విషయాలను సీరియస్ గా తీసుకోవడం ప్రారంభించాయి. టిక్కెట్ బ్లాకింగ్ విధానానికి స్వస్తి పలికి ఆన్ లైన్ లోనే ఎక్కువ శాతం బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా గురువారం భారీ స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ విషయంలో హైదరాబాద్ లోని పలు థియేటర్ చైన్స్ మేనేజ్మెంట్స్ తెలివిగా వ్యవహరించాయి.

SVP ని రిలీజ్ చేసే థియేటర్లలో చాలా వరకు టిక్కెట్లను బ్లాక్ చేయలేదు. ఆన్ లైన్ బుకింగ్స్ లోనే 90 శాతం టికెట్స్ అందుబాటులో ఉంచారు. అందుకే ఫస్ట్ డే బుక్ మై షోలో చాలా థియేటర్స్ గ్రీన్ గా కనిపించాయని తెలుస్తోంది.

సాధారణంగా థియేటర్ చైన్స్ పెద్ద సినిమాల రిలీజ్ టైంలో ఆన్ లైన్ టిక్కెట్లను బ్లాక్ చేసి.. తరువాత వాటిని నేరుగా కౌంటర్లలో అమ్ముతుంటారు. అయితే టికెట్ రేట్ల పెంపుతో గతంలో మాదిరిగా కొత్త సినిమాలను చూసేందుకు రిలీజ్ రోజు ప్రేక్షకులు థియేటర్ల వైపు పరుగులు తీయడం లేదు.

ఈ నేపథ్యంలోనే థియేటర్ యాజమాన్యాలు ఇప్పుడు తెలివిగా వ్యవహరిస్తూ దాదాపు అన్ని టిక్కెట్లను ఆన్లైన్ లో పెట్టేస్తున్నారు. అధిక టికెట్ రేట్ల కారణంగా ఆశించిన స్థాయిలో సర్కారు వారి పాట సినిమాకు బుకింగ్స్ లేవని తెలుస్తోంది. అయితే హైర్స్ కారణంగా అమ్ముడైన టికెట్లతోనే మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.

నైజాంలో SVP మూవీ తొలి రోజు జీఎస్టీతో కలిపి 12.24 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇది నాన్-RRR రికార్డ్ గా పేర్కొనబడింది. మరి మిక్స్డ్ టాక్ తో రాబోయే రోజుల్లో మహేశ్ బాబు సినిమా ఎలా రాణిస్తుందో చూడాలి.