సరిలేరు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ వచ్చేసిందోచ్

Sun Dec 15 2019 16:12:35 GMT+0530 (IST)

Sarileru Neekevvaru Movie Pre Release Event Date Confirmed

సూపర్ స్టార్ మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు.  భారీ అంచనాలు నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  విడుదలకు తక్కువ సమయం ఉండడంతో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే టీజర్.. రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసిన 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంటుకు డేట్ టైం ఖరారు చేశారు'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ కార్యక్రమం జనవరి 5 వ తారీఖున జరుగుతుందని.. సాయంత్రం 5.04 గంటలకు ప్రారంభమవుతుందని ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో జరుగుంది.  ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో మహేష్ బాబు రాయల్ ఎన్ఫీల్డ్ బైకుపై చెయ్యి వేసి స్టైలిష్ గా నిలబడ్డారు.  వైట్ టీ షర్టు.. బ్లాక్ ప్యాంట్.. బ్లాక్ జాకెట్.. కూలింగ్ గ్లాసెస్ ధరించి సూపర్ స్టార్ స్టైల్ ఏంటో చూపించారు. పోస్టర్ లో డేట్.. టైం.. లొకేషన్ వెల్లడించారు కానీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎవరు హాజరు కానున్నారనే విషయం మాత్రం వెల్లడించలేదు.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.  విజయశాంతి.. ప్రకాష్ రాజ్.. రాజేంద్రప్రసాద్.. సంగీత.. హరితేజ.. బండ్ల గణేష్.. వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ సినిమాను అనిల్ సుంకర ..దిల్ రాజు.. మహేష్ బాబు సంయక్తంగా నిర్మిస్తున్నారు.