Begin typing your search above and press return to search.

సరిలేరు: ఏం జరిగిందో మీకు అర్థం అవుతోందా?

By:  Tupaki Desk   |   28 Jan 2020 4:36 AM GMT
సరిలేరు: ఏం జరిగిందో మీకు అర్థం అవుతోందా?
X
ఈ సంక్రాంతికి విడుదలైన భారీ సినిమాలలో మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' ఒకటి. సినిమాపై ఉన్న హైప్.. సంక్రాంతి శెలవులు సినిమాకు కలిసి రావడంతో దాదాపుగా బ్రేకీవెన్ అయింది. అయితే వాస్తవ పరిస్థితులకు పూర్తి వ్యతిరేకంగా ఈ సినిమాను ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్(నాన్ బాహుబలి) అని ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇలా చేసినందువల్ల సినిమా ఘనత తగ్గిపోవడం తప్ప 'సరిలేరు నీకెవ్వరు' కు కొత్తగా ఒనగూరేది ఏమీ లేదు.

ఈ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ పోస్టర్ పై ఫిలిం నగర్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు నిజంగా నాన్ బాహుబలి రికార్డు సాధించే సత్తా పుష్కలంగా ఉందని.. అతి సులభంగా అల్ టైమ్ టాప్-3 స్థానంలో నిలిచేదని కాకపోతే దర్శకుడు అనిల్ రావిపూడి ఆ అవకాశం జారవిడుచుకున్నారని అంటున్నారు. కొన్ని అంశాల్లో అనిల్ చేసిన పొరపాట్లే దీనికి కారణం అంటున్నారు.

అనిల్ రావిపూడి సినిమాలు గమనిస్తే అర్థమయ్యేది.. కామన్ గా అనిపించే విషయం ఒకటుంది. అదే సెకండ్ హాఫ్ గ్రాఫ్ పడిపోవడం.. వీక్ గా ఉండడం. 'సరిలేరు నీకెవ్వరు' రిలీజ్ కు ముందు ఇంటర్వ్యూలలో అనిల్ కు ఈ ప్రశ్న ఎదురైంది. అందరూ అనుమానించినట్టే ఈ సినిమాలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. సెకండ్ హాఫ్ వీక్.. పైగా క్లైమాక్స్ అందరికీ కనెక్ట్ కాలేదు. అన్ కన్వెన్షనల్ క్లైమాక్స్ అనుకున్నారు కానీ బలహీనంగా ఉందనే విషయం అనిల్ గుర్తించలేదు.

మరో అంశం ఏంటంటే కామెడీ వర్క్ అవుట్ కాలేదు. నిజానికి అనిల్ రావిపూడి బలం కామెడీ. ఈ సినిమాలో కొన్ని చోట్ల కామెడీ వర్క్ అవుట్ అయింది కానీ ఎక్కువ చోట్ల కామెడీ పండలేదు. ఎంతో ఊదర గొట్టిన ట్రెయిన్ ఎపిసోడ్ తుస్సుమనిపించింది. బండ్ల గణేష్ పాత్ర చిరాకు తెప్పించింది. రేప్ పై జోక్స్ వేయడం కూడా చీప్ టేస్ట్ అని చాలామంది విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇక దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ను తీసిపారేయలేం.. కానీ ఫ్రాంక్ గా చెప్పుకుంటే సరిలేరు ఆడియో జస్ట్ యావరేజ్. దేవీ మంచి ఆడియో ఇచ్చి ఉంటే ఈ సినిమా నెక్స్ లెవెల్ కు పోయే ఛాన్స్ ఉండేది. భారీ పోటీ ఉండే సంక్రాంతికి ఇలాంటి ఆల్బమ్ ఇవ్వడం అభిమానులకూ చిరాకు తెప్పించింది. అసలు ఈ సినిమాకు దేవీని ఎంచుకున్నప్పుడే విపరీతమైన నెగెటివిటీ కనిపించింది. అయినా అనిల్ రావిపూడి మార్చకుండా దేవీనే కంటిన్యూ చేయడంతో నష్టం జరిగింది.

ఈ సినిమాను ఆరు నెలల్లో.. ఏడు నెలల్లో పూర్తి చేశామని అంటున్నారు కానీ ఇలా త్వరగా పూర్తి చేయాలనే ఒత్తిడి కారణంగానే లోపాలపై దృష్టి సారించే అవకాశం లేకుండా పోయిందని దీని వల్ల కూడా సినిమాకు నష్టం జరిగిందని అంటున్నారు.

ఇలాంటి అంశాలన్నీ పట్టించుకుని వాటిని సరి చేసి ఉంటే జనాలే 'సరిలేరు నీకెవ్వరు' నాన్ బాహుబలి-ఇండస్ట్రీ హిట్ అని కితాబిచ్చేవారు. ఇపుడు అలా జరగలేదు. ఇండస్ట్రీ హిట్ అని స్వయంగా ఊదరగొట్టినా జనాలు నమ్మని పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ఎక్కడ లోటుపాట్లు జరిగాయనేది గుర్తించడం మంచిది. అది లేకుండా అన్ని రికార్డులు మావే అంటుండడం నలుగురిలో నవ్వుల పాలయ్యేలా చేస్తోంది. ఇది మహేష్ ఇమేజ్ ను కూడా దెబ్బతీస్తోంది.