టీజర్ టాక్ : అతనొక డేంజరస్ న్యూక్లియర్!

Fri Sep 30 2022 11:35:56 GMT+0530 (India Standard Time)

Teaser talk: Sardar Official Teaser

విభిన్నమైన సినిమాలతో ఆకట్టుకుంటూ హీరోగా తమిళ తెలుగు భాషల్లో ప్రత్యేక గుర్తింపుని సొంత చేసుకున్నాడు తమిళ హీరో కార్తి. సెప్టెంబర్ 30న మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్ 1'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన కార్తి అక్టోబర్ లో దీపావళికి తమిళ తెలుగు ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. కార్తి నటించిన లేటెస్ట్ స్ప్రై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'. పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించారు. రాశీఖన్నా 'జైభీమ్' ఫేమ్ రజీషా విజయన్ హీరోయిన్ లుగా నటించారు.ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ మూవీని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కింగ్ నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో చాలా రోజుల తరువాత హీరో కార్తి ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. పవర్ ఫుల్ పోలీస్ కదిరవన్ గా వయసు మళ్లిన సర్దార్ గా రెండు పాత్రల్లోనూ కార్తీ కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాల్ని భారీ బజ్ ని క్రియేట్ చేసింది.

సినిమా రిలీజ్ కి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచేశారు. శుక్రవారం తెలుగు టీజర్ ని విడుదల చేశారు. 'ఇండియన్ మిలటరీ వాళ్ల కాన్ఫిషికేషన్ వార్డ్ లోకి ఒకడు ఎంటరయ్యాడు.. ఇండియన్ ఇంటలిజెన్స్ రహస్యాలన్నీ..అందులోనే వున్నాయి.. ఆ రహస్యాలు బయటికొచ్చాయంటే కంప్లీట్.. అతనొక డేంజరస్ న్యూక్లియర్' అంటూ ఓ వాయిస్ తో టీజర్ మొదలైంది. టీజర్ లోని సన్నివేశాలు డైలాగ్ లు వింటుంటే సినిమాలో కార్తి ఇంటర్నేషన్ స్పైగా అత్యంత పవర్ ఫుల్ పాత్రలో నటించినట్టుగా తెలుస్తోంది.

టీజర్ లో కార్తీ ఇరు విభిన్నమైన గెటప్ లలో కనిపించి సర్ ప్రైజ్ చేశాడు. విభిన్న సమయాల్లో సాగే కథగా ఈ మూవీని దర్శకుడు పీ.ఎస్. మిత్రన్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించినట్టుగా స్పష్టమవుతోంది. సినిమాలోని కార్తి క్యారెక్టర్ లు గత చిత్రాలకు పూర్తి భిన్నంగా చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి. కార్తి అబిమానులకు ఇదొక ఫ్రెష్ ఫీల్ ని సరికొత్త అనుభూతిని కలిగించే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మూవీగా నిలవడం ఖాయం.  

టీజర్ కట్ లో దర్శకుడు పీఎస్ మిత్రన్ టేకింగ్ కాజీపడని మేకింగ్ కనిపిస్తోంది. అంతే కాకుండా జార్జ్ సి. విలియమ్స్ ఫొటోగ్రఫీ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాని మరింత హైట్స్ కి తీసుకెళ్లేలా వున్నాయి. మొత్తానికి ఈ సినిమాతో తెలియని కొత్త విషయాన్ని ప్రేక్షకులకు చెప్పబోతున్నారనే ఆసక్తిని 'సర్దార్' టీజర్ కలిగించడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది. చుంకీ పాండే విలన్ గా నటిస్తున్న ఈ మూవీలోని ఇతర పాత్రల్లో లైలా మురళీ శర్మ మునిష్ కాంత్ తదితరులు నటిస్తున్నారు. అక్టోబర్ 24న ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కాబోతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.