నందమూరి హీరో 'సారథి' ఫస్ట్ లుక్...!

Tue Oct 27 2020 15:40:46 GMT+0530 (IST)

Nandamuri hero '' Saradhi '' first look ...!

నందమూరి నటవారసుడు తారకరత్న హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''సారథి''. పంచభూత క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి జాకట రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తారకరత్న సరసన హీరోయిన్ గా కోన శశిత నటిస్తోంది. సిద్ధార్థ్ వాటికన్స్ సంగీతం అందిస్తున్నారు. ఓ షెడ్యూల్ మినహా ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయిందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో విజయదశమి సందర్భంగా 'సారథి' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.ఈ సందర్భంగా దర్శకుడు జాకట రమేష్ మాట్లాడుతూ.. ''ఇటీవల అనౌన్స్ చేసిన పంచభూత క్రియేషన్స్ బ్యానర్ లోగోకి.. మా బేనర్ లో నిర్మిస్తున్న 'సారథి' టైటిల్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నుండి దసరా కానుకగా నందమూరి తారకరత్న ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. దసరాకి ఎంతో కాంపిటేషన్ ఉన్నప్పటికి 'సారథి' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి మంచి స్పందన వస్తోంది. స్నేహితులు సన్నిహితులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు'' అని చెప్పాడు.

''కరోనా సమయంలో కూడా నందమూరి తారకరత్న గారు ఎంతో సాహసంతో షెడ్యూల్ ను పూర్తి చేసి మాకు సహకరించారు. ఆయనకి మా చిత్ర బృందం ఎప్పటికీ ఋణ పడి ఉంటుంది. గతంలో మా సినిమాకి ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాకి కూడా వాళ్ల దగ్గర నుండి మంచి సపోర్ట్ లభిస్తోంది. మంచి కంటెంట్ ఉంటే ఇండస్ట్రీ ఎప్పుడూ సపోర్ట్ చేస్తుందని 'రథేరా' తర్వాత 'సారథి' సినిమాతో మరోసారి నిరూపితమైంది. త్వరలోనే ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని డైరెక్టర్ జాకట రమేష్ చెప్పుకొచ్చారు.