Begin typing your search above and press return to search.

నాన్నలో విక్రమ్ కూతురు.. ఇప్పుడెలా ఉందో తెలుసా?

By:  Tupaki Desk   |   30 April 2023 2:00 PM GMT
నాన్నలో విక్రమ్ కూతురు.. ఇప్పుడెలా ఉందో తెలుసా?
X
చియాన్ విక్రమ్ నాన్న సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాలో విక్రమ్ మానసికంగా ఎదగని ఓ తండ్రి పాత్రలో నటించాడు. ఆయనకు ఓ కూతురు కూడా ఉంటుంది. ఆ కూతురు పాత్రలో నటించిన చిన్నారి మీకు గుర్తుండే ఉంటుంది. అంత చిన్న వయసులోనే ఆ సినిమాలో నటన ఇరగదీసింది.

ఆ సినిమా చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. తండ్రి, కూతుళ్ల ప్రేమను చాలా అద్భుతంగా చూపించారు. ఇప్పుడు ఆ చిన్నారి టీనేజ్ వయసు వచ్చింది. రావడమేకాదు.. టీనేజ్ లో అందాలు ఆరబోస్తూ అలరిస్తోంది. పేరు సారా అర్జున్. శుక్రవారం విడుదల అయిన పొన్నియన్ సెల్వన్ 2లో ఈ పాప మెరిసింది.

నిజానికి మొదటి భాగంలోనూ సారా అర్జున్ నటించింది. కానీ చాలా తక్కువ నిడివి ఉండటంతో ఎవరూ పెద్దగా ఫోకస్ చేయలేదు. ఇప్పుడు రెండో భాగంలో కాస్త ఎక్కువసేపే కనపడింది. దీంతో.. అందరి కళ్లు ఈ పాప పై పడ్డాయి. అప్పుడే అంత తొందరగా ఎదిగిందా అని ఆశ్చర్యపోతున్నారు.

పొన్నియన్ సెల్వన్ లో నందిని పాత్రను ఐశ్వర్యారాయ్ నటించింది. ఐశ్వర్యారాయ్ టీనేజ్ క్యారెక్టర్ లో సారా నటించడం విశేషం. ఆమె నటనకు అందరూ మంత్రముగ్ధులైపోతున్నారు. చిన్నటి వరకు చిన్న పిల్లలా కనిపించిన సారా.. ఇప్పుడు అందమైన యువతిలా కనిపించడంతో అందరూ షాకైపోతున్నారు.

హీరోయిన్ ఛాన్సులు కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా చిన్న సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్ ఛాన్సులు సారాను వెతుక్కుంటూ వెళతాయని పలువురు భావిస్తున్నారు.

సారా అర్జున్, 2011లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ మొదలుపెట్టింది. హిందీ .. తమిళ .. మలయాళ భాషల్లో చైల్డ్ ఆర్టిస్టుగా అనేక పాత్రలలో మెప్పించింది. 2015లో 'దాగుడుమూత దండాకోర్' అనే సినిమాలో రాజేంద్రప్రసాద్ తో కలిసి నటించింది. సారా తండ్రి రాజ్ అర్జున్ కూడా నటుడే. ఆయన పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ సీరియల్స్ లో నటించారు. భవిష్యత్తులో సారా కి మరిన్ని మంచి అవకాశాలు రావాలని మనమూ కోరుకుందాం.