Begin typing your search above and press return to search.
ఓటీటీ రిలీజ్..స్టార్ డాటర్ అప్సట్!
By: Tupaki Desk | 24 March 2023 4:00 PMఇటీవలి కాలంలో బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీతో సేఫ్ సైడ్ గా బిజినెస్ చేసుకుని దర్శక-నిర్మాతలుచేతులు దులుపుకుంటున్నారు. ఆ తర్వాత నష్టమోచ్చినా.. కష్టమో చ్చినా భారమంతా మోయాల్సిందే ఓటీటీనే. అందుకే బాలీవుడ్ లో పరిమిత బడ్జెట్ సినిమాల రిలీజ్ లు అన్ని ఓటీటీ కే మొదటి ప్రాధన్యత ఇస్తున్నాయి. ఇప్పుడదే మార్గంలో టైర్-2 హీరోలు సైతం ప్రయాణిస్తు న్నారు.
కార్పోరేట్ ఓటీటీ కంపెనీలతో బిగ్ డీల్స్ కుదుర్చుకుని ముందుకెళ్తున్నారు. అనుష్క శర్మ.. కంగనా రనౌత్ లాంటి వారు కూడా సొంత నిర్మాణంలో సినిమా అంటే? ముందుగా ఓటీటీకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే ఒప్పందం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మిగతా పరిశ్రమలతో పోల్చుకుంటే ఎక్కువగా బాలీవుడ్ సినిమాలే ఓటీటీ రిలీజ్ అవుతున్నట్లు సర్వేలు సైతం చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా స్టార్ కిడ్ సారా అలీఖాన్ థియేట్రికల్ సినిమాను మిస్ అవుతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో సారా నటించిన 'కూలీ నెం-1'-'ఆత్రంగిరే' ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం సారా నటిస్తోన్న 'గ్యాస్ లైట్' కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగానే సారా అన అసంతృప్తిని తెలివిగా వ్యక్త పరిచింది.
'నేను కొన్నేళ్లగా వెండి తెరను మిస్ అవుతున్నాను. నా సినిమాలన్నీ వరుసగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. ఆత్రంగిరే కి హాట్ స్టార్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నాను. సినిమా కథ- అందులో నటన నిజాయితీగా ఉంటే ప్రేక్షకులకు నచ్చుతుంది. కానీ నేను మాత్రం థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమా కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను.
ఈ విషయంలో కోంచెం బాధగానూ ఉంది. థియేటర్ నటిని అవ్వడానికి రంగేసుకున్నాను. ఓటీటీలో కాదు. గ్యాస్ లైట్ నిర్మాతల నిర్ణయం ప్రకారం ఓటీటీలో రిలీజ్ అవుతుంది. బహుశా ఈ సినిమా కంటెంట్ ఓటీటీకి సరిపోతుందని నిర్మాతలు అలా నిర్ణయించారేమో' అని తెలిపింది.
మొత్తంగా సారా అలీఖాన్ లో తన సినిమాలు థియేటర్లో రిలీజ్ అవ్వడం లేదు అన్న బాధ కనిపిస్తుంది. సారా సహచర నటి జాన్వీకపూర్ రసులో దూసుకుపోతుంటే స్నేహితురాలు మాత్రం అంతకంతకు వెనుకబడిపోతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.