మారుతి - సంతోష్ శోభన్ ల ‘మంచి రోజులు వచ్చాయి’ ఫస్ట్ లుక్..!

Tue Jul 20 2021 19:02:49 GMT+0530 (IST)

Santosh And Mehreen Look Lovely In Manchi Rojulu Vachayi

'ఏక్ మినీ కథ' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో సంతోష్ శోభన్.. వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే 'ప్రేమ్ కుమార్' 'అన్నీ మంచి శకునములే' వంటి రెండు చిత్రాలను ప్రకటించిన సంతోష్.. తాజాగా ''మంచి రోజులు వచ్చాయి'' అనే కొత్త సినిమాని అనౌన్స్ చేసాడు. వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్ గా నటిస్తున్నారు. గతంలో మారుతి దర్శకత్వంలో 'మహానుభావుడు' లాంటి సూపర్ హిట్ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. యువీ కాన్సెప్ట్స్ - మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న 'మంచి రోజులు వచ్చాయి' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈరోజు మంగళవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఫస్ట్ లుక్ పోస్టర్ లో సంతోష్ శోభన్ ఓ గోడకు అనుకోని స్టైల్ గా నిలబడి ఉండగా.. మెహ్రీన్ ఫిర్జాదా అతని కళ్ళలోకి చూస్తూ నవ్వుతూ కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ తోనే 'మంచి రోజులు వచ్చాయి' ఫ్రెష్ ఫీలింగ్ ని కలిగిస్తోంది. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ సినిమా వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్న సినిమా అని మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్ మరియు SKN కలిసి నిర్మిస్తున్నారు. 'టాక్సీవాలా' వంటి సూపర్ హిట్ తర్వాత వీరి నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తుండగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలు దర్శక నిర్మాతలు త్వరలోనే తెలియజేయనున్నారు.

మారుతి - యూవీ సంస్ధ - SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్ అనే పేరుంది. ఈ కాంబోలో ఇప్పుడు వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అంతేకాదు 'ఏక్ మినీ కథ' లాంటి హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్ తో యువ హీరో సంతోష్ శోభన్ మరోసారి జత కడుతున్నాడు. అన్నీ పాజిటివ్ అంశాలతో వస్తున్న 'మంచి రోజులు వచ్చాయి' క్సినిమా.. చిత్ర బృందానికి ఎలాంటి మంచి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.