సంక్రాంతి పండుగ అంటే తెలుగు వారికే కాదు సినీ పరిశ్రమకు కూడా ఇదొక పెద్ద పండగ. ఏడాది ఆరంభంలో వచ్చే ఈ పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని థియేటర్లలో సినిమాల జాతర మామూలుగా ఉండదు. పెద్ద పెద్ద స్టార్స్ తమ సినిమాలను ఈ పండగకే ప్లాన్ చేసుకుంటారు. నిర్మాతలు కూడా ఈ పండగక్కి బాగా మెుగ్గు చూపుతారు. అలా 2023 సంక్రాంతిలోనూ భారీ చిత్రాలు విడుదల అయ్యాయి. బాలకృష్ణ వీర సింహా రెడ్డి చిరంజీవి వాల్తేరు వీరయ్య బరిలో నిలిచాయి.
తమిళం నుంచి వారిసు తునివు రిలీజ్ చేశారు. అసలే ప్రేక్షకులకి పండగ వచ్చే వరకు ఏఏ సినిమాలు వస్తాయనే అసక్తి.. పండగ ముగిశాక ఏ చిత్రాలు ఎంత మొత్తంలో సాధించాయి అని కనుక్కోవడంలో ఆసక్తి. అయితే ఇప్పుడు సంక్రాంతి జాతర ముగియడంతో ప్రేక్షకుల దృష్టి ఇప్పుడు ఈ పండగ బరిలో ఎవరు గెలిచారు అనే విషయమై పడింది.
ఇక ఈ విషయానికొస్తే.. ఈ సంక్రాంతి లో చిరంజీవి వాల్తేరు వీరయ్య బాలకృష్ణ వీర సింహారెడ్డి రెండు విజేతగా నిలిచాయి. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే వాల్తేరు ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూలు చేయగా వీరసింహారెడ్డి రూ.120 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అంటే చిరునే బాలయ్యపై పై చేయి సాధించినట్లు అయింది. మరి గత ఐదేళ్లుగా చూసుకుంటే ఈ సంక్రాంతి బరిలో ఏఏ చిత్రాలు పోటీకీ దిగాయి? అత్యధిక వసూళ్ళతో విన్నర్స్ గా నిలిచిన మూవీస్ ఏంటి? ఆ వివరాలు కూడా తెలుసుకుందాం
2019 సంక్రాంతికి రామ్ చరణ్ వినయ విధేయ రామ బాలయ్య ఎన్టీఆర్ కథానాయకుడు వెంకీ-వరుణ్ ల మల్టీస్టారర్ ఎఫ్ 2 విడుదలయ్యాయి. అనూహ్యంగా ఎఫ్2 విజయం సాధించింది. 2020లో అల వైకుంఠపురంలో సరిలేరు నీకెవ్వరు ఎంత మంచివాడవురా రిలీజ్ అయ్యాయి. కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా ప్లాప్ కాగా... మహేష్ అల్లు అర్జున్ చిత్రాలు రెండూ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఎక్కువ వసూళ్లతో అల్లు అర్జున్ సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు.
2021లో రవితేజ క్రాక్ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఆ ఏడాది రామ్ పోతినేని రెడ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ తో పాటు సైకిల్ మెయిల్ అనే రెండు చిన్న చిత్రాలు విడుదలయ్యాయి.
రెడ్ యావరేజ్ టాక్ తెచ్చుకాగా.. అల్లుడు అదుర్స్ ప్లాప్ అయ్యింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో 2022లో బంగార్రాజు హీరో రౌడీ బాయ్స్ సూపర్ మచ్చి చిత్రాలు విడుదలయ్యాయి. చిన్న చిత్రాల మధ్య రిలీజ్ అయిన బంగార్రాజు సంక్రాంతి విన్నర్ అయ్యింది. ఇక ఈ ఏడాది సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య కళ్యాణం కమనీయం చిత్రాలు దిగాయి. వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డి రెండు విజేతగా నిలిచాయి. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే వాల్తేరు ఎక్కువ వసూలు చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.