మహేష్ బావ టీజర్ డేట్ ఇచ్చేశాడు

Sat Jan 15 2022 15:58:24 GMT+0530 (IST)

Sankranti Poster Sudheer Krithi Rom Com Teaser Getting Ready

హీరోలంతా రిలీజ్ డేట్‌లు కొత్త పోస్టర్ లతో ఈ సంక్రాంతికి సందడి చేస్తున్నారు. కొంత మంది తమ రిలీజ్ లని వాయిదా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు బావ సుధీర్ బాబు మాత్రం తన కొత్త సినిమా అప్ డేట్ ఇచ్చేశారు. `శ్రీదేవి సోడా సెంటర్` మూవీతో గత ఏడాది సాలీడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీ సక్సెస జోష్ తో మరో చిత్రాన్ని పట్టాలెక్కించారు. అదే `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`.ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. `ఉప్పెన` తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బేబమ్మగా సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న కృతిశెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. టైటిల్ ని బట్టి మూవీ స్టోరీ మొత్తం బేబమ్మ చుట్టే తిరిగేలా కనిపిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి. మహేంద్ర బాబు కిరణ్ బల్లపల్లి ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ నిర్మాణంలో మైత్రీ మూవీస్ కూడా భాగస్వామిగా చేరడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. భారీ నిర్మాణ సంస్థ వరుసగా సూపర్ హిట్ లని అందుకుంటున్న మైత్రీ వారు ఈ మూవీకి వెన్నుదన్నుగా నిలవడంతో సినిమాలో ఖచ్చింతగా విషయం వుందనే చర్చ మొదలైంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ మూవీ అప్ డేట్ ఇచ్చి చాలా కాలం అవుతోంది.

ఈ నేపథ్యంలో సంక్రాంతికి మరో పోస్టర్ ని రిలీజ్ చేసిన మేకర్స్ ఈ సారి టీజర్ రిలీజ్ డేట్ ని ప్రకటించేశారు. ఈ మూవీ టీజర్ ని జనవరి 17న విడుదల చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఇక శనివారం సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లోనూ కృతిశెట్టి సుధీర్ బాబు మరింత రొమాంటిక్ మూడ్ లో కనిపిస్తుండటం ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పీజీ వింద వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.