శేఖర్ కమ్ములా దర్శకత్వంలో సంజయ్ దత్ విలన్ !

Mon Dec 05 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

Sanjay Dutt Villain directed by Sekhar Kammula

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా శేఖర్ కమ్ములా దర్శకత్వంలో మూడు భాషల్లో ఓ  చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు..తమిళ్..హిందీ భాషల్లో చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాలన్నది కాంబో ప్లానింగ్. పాత్ బ్రేకింగ్ చిత్రాలు అందించిన శేఖర్ కమ్ములా కథని ధనుష్ ఒకే చేసాడంటేనే స్ర్కిప్ట్ బలమెంతన్నది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.తాజాగా ఈ సినిమాలో ధనుష్ ని ఢీకొట్టడానికి ఏకంగా బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ నే రంగంలోకి దించుతున్నారుట.  ధనుష్ ధీటైన ప్రత్యర్ధి ఎవరంటే? కమ్ములా నుంచి మొదట వచ్చిన పేరు సంజయ్ దత్ అని సమాచారం. ఆయన మాత్రమే తాను రాసుకున్న పాత్రకు న్యాయం చేయగలడని భావించి దత్ కోసం సీరియస్ ప్రయత్నాలు  మొదలు పెట్టినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.

ఇది నిజంగా కమ్ములా అభిమానులకు షాకింగ్ అనే చెప్పాలి. సెన్సిబుల్ చిత్రాల మేకర్ శేఖర్ కమ్ములాకి సంజయ్ దత్ లాంటి మాస్ విలన్ ఏంటి? అంటూ అప్పుడే చర్చ మొదలైంది. శేఖర్ కమ్ములా రూటు మార్చి భారీ యాక్షన్ చిత్రాన్ని ప్లాన్ చేసాడా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ధనష్ ఎలాంటి పాత్ర అయిన అవలీలగా  పోషించగల నటుడు. క్లాస్..మాస్ అన్ని కలిపి నటించేస్తాడు.

కానీ సంజయ్ దత్ తో  క్లాస్ పాత్రలకు సూటవ్వడం అన్నది కష్టమైన పని. అతని హైట్..వెయిట్...లుకింగ్ స్టైల్ కి యగ్రసివ్ రోల్ అయితేనే పక్కాగా యాప్ట్ అవుతాడన్నది  వాస్తవం. మరి కమ్ములా ధనుష్ కోసం మాంచి యాక్షన్ స్టోరీ రాసాడా?  లేక తనదైన శైలి కథని సిద్దం చేసారా? అన్నది  తెలియాలి. సంజయ్ దత్ ఇటీవల `కేజీఎఫ్-2` లో విలన్  పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అధీర పాత్రలో దత్ చించేసాడు. ఆ రకంగా సంజయ్ దత్ సౌత్ కూడా ఎంట్రీ   అదిరిపోయింది. మరి శేఖర్ కమ్ములా ఆఫర్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.