తమిళ వాళ్ళు అలా.. తెలుగోళ్ళు ఇలా: సందీప్ కిషన్

Sun Jan 29 2023 19:44:39 GMT+0530 (India Standard Time)

Sandeep Kishan In Micheal Promotions

యువ హీరో సందీప్ కిషన్ సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా కాలం అయింది. అయితే అతను మొదట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ప్రతీసారి కూడా కంటెంట్ లేదా కామెడీ వర్కౌట్ అయితేనే అతనికి సక్సెస్ వచ్చింది. కానీ ఎప్పుడూ కూడా డిఫరెంట్ గా ట్రై చేస్తే మాత్రం సక్సెస్ అందుకోలేకపోయాడు. ఈ హీరో ప్రతి ఏడాది రెండు లేదా మూడు సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఇంకా అతని రేంజ్ ను పెంచే సినిమాలు మాత్రం పడటం లేదు.వీలైనంతవరకు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను డిఫరెంట్ ప్రయోగాలను చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఇప్పుడు అతని నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ మైకల్. ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ సేతుపతి లాంటి స్టార్ కూడా ఇందులో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తున్నాడు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లో యువ హీరో సందీప్ కిషన్ ప్రమోషన్స్ విషయంలో ఊహించని విధంగా ఒక వివరణ ఇచ్చాడు. పాన్ ఇండియా సినిమాను కూడా వివిధ భాషల్లో స్ట్రైట్ మూవీ అని చెప్పినా కూడా బేధాలు చూపిస్తారు. తమిళంలో అయితే ఇంకా డబ్బింగ్ అనే ముద్ర మారలేదు. కానీ తెలుగు ఆడియోన్స్ మాత్రం ఆ విషయంలో పెద్దగా అనుమానాలు పెట్టుకోకుండా సినిమాను చూస్తారు. ఎంతగా ట్రై చేసినా కూడా ఈ డిఫరెన్స్ అనేది ఎవరు కూడా మార్చలేకపోతున్నారు అనే విధంగా సందీప్ కిషన్ ఒక వివరణ అయితే ఇచ్చే ప్రయత్నం చేశాడు.

ఇక మైకల్ సినిమా మాత్రం తప్పకుండా ఒక జెన్యూన్ అటెంప్ట్ అని.. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది అని బడ్జెట్ విషయంలో అలాగే కంటెంట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తరికెక్కించినట్లుగా చెప్పాడు. ఆడియన్స్ టైం అనేది చాలా వాల్యూ తో కూడుకున్నది అని మైకల్ సినిమా చూసినప్పుడు తప్పకుండా ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు అని సందీప్ కిషన్ దీమా వ్యక్తం చేశాడు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 3వ తేదీన విడుదల కాబోతోంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈసారైనా సందీప్ కిషన్ సరైన సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.