మహేష్ మరదలిగా `భీమ్లా నాయక్` బ్యూటీ

Wed Jan 26 2022 23:00:01 GMT+0530 (India Standard Time)

Samyuktha menon In Mahesh Babu Film

సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఫైనల్ వెర్షన్ స్క్రిప్ట్ ని మహేష్ దుబాయ్ లో విన్నారు.  కథాంశం మహేష్ ని ఎంతో ఎగ్టైట్ మెంట్ కి గురి చేసిందని తెలుస్తోంది. ఇప్పటికే సినిమా కూడా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ మహేష్ కోవిడ్ బారిన పడటం...బ్రదర్ రమేష్ బాబు స్వర్గస్తులైన నేపథ్యంలో డిలే అవుతోంది. ఇక `సర్కారు వారి పాట` షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్యాచ్ వర్క్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్  పూర్తి కాగానే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలని కదులుతున్నారు. అలాగే `సర్కారు  వారి పాట` చిత్రాన్ని కూడా వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పనిచేస్తున్నారు.ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన వెంటనే మహేష్ పూర్తిగా త్రివిక్రమ్  ప్రాజెక్ట్ కే అంకితం కానున్నారు. ఇందులో మహేష్ కి జోడీగా పూజాహెగ్డేని లాక్ చేసారు. తాజాగా సినిమాలో మహేష్ మరదలి పాత్ర కూడా కీలకం కానుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆ పాత్ర కోసం సంయుక్త మీనన్ ని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ భామ ప్రస్తుతం `భీమ్లా నాయక్` లో రానాకి జోడీగా నటిస్తోంది. ఈ సినిమా పనులన్నింటిని త్రివిక్రమ్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలో  సంయుక్త నటనకి ఫిదా అయిన దర్శకుడు మహేష్ మరదలి పాత్రకు ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

మాటల మాంత్రికుడు స్క్రిప్ట్ లో హీరోతో పాటు..హీరోయిన్లు...క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందనేది చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకూ త్రివిక్రమ్  సినిమాల్లో నటించిన హీరోయిన్లకు... ఇతర పాత్రధారులకు కూడా మంచి గుర్తింపు దక్కింది. ఇలాంటి దర్శకుడి చేతిలో ట్యాలెంటెడ్ హీరోయిన్లు పడ్డారంటే నటనలో మరింత షైన్ అవుతారు. నటిగా సంయుక్త మీనన్ కి మంచి పేరుంది. త్రివిక్రమ్ ఇచ్చిన తాజా అవకాశంతో అమ్మడికి  టాలీవుడ్ లో ఎదగడానికి స్కోప్ ఉంది.  మలయాళంలో లిలీ - పాప్ కార్న్- కల్కి సహా పలు విజయవంతమైన చిత్రాల్లో సంయుక్త మీనన్ నటించింది.