యంగ్ హీరో 'సమ్మతమే' ఓటీటీ అలర్ట్

Thu Jul 07 2022 12:18:40 GMT+0530 (IST)

Sammathame OTT release

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన సమ్మతమే సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. చిన్న సినిమాగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సో సో అన్నట్లుగానే నడిచింది.కిరణ్ అబ్బవరం మరియు ఛాందిని చౌదరి జంటగా తెరకెక్కిన ఈ సినిమా కు పోటీగా పలు సినిమాలు రావడం వల్ల కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేక పోయిందనే టాక్ ఉంది.

ఈమద్య కాలంలో బాక్సాఫీస్ సందడి చేయలేక పోయినా కూడా ఓటీటీ లో విడుదల అవుతూ హడావిడి చేస్తున్నాయి. కనుక ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఒక వర్గం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఓటీటీ లో సమ్మోహనం సినిమా యొక్క స్ట్రీమింగ్ తేదీపై క్లారిటీ వచ్చింది.

ఈ సినిమా ను ఆహా ఓటీటీ వారు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేక పోయినా కూడా ఖచ్చితంగా ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడం ఖాయం అన్నట్లుగా వారు నమ్మకంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఆహా టీమ్ ఈ సినిమా ను జూలై 15వ తారీకున స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధం అన్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఆహా వారు ఏరి కోరి.. చాలా విభిన్నమైన సినిమాలను మాత్రమే స్ట్రీమింగ్ చేస్తూ ఉంటారు. కనుక ఈ సినిమా తప్పకుండా మంచి టాక్ ను దక్కించుకుని ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.