Begin typing your search above and press return to search.

ముంబైలో సమంత కొత్త ఫ్లాట్ రెడీ అంటూ..!

By:  Tupaki Desk   |   29 Jan 2023 8:00 AM GMT
ముంబైలో సమంత కొత్త ఫ్లాట్ రెడీ అంటూ..!
X
స్టార్ హీరోయిన్ సమంత ముంబైలో సొంత ఇల్లు కొనుక్కున్నార‌ని ఇటీవ‌ల ప్ర‌చారం సాగుతోంది. ప్రస్తుతం అందరూ ఆ ముంబై ఇంటి గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. సమంత తాను ఉంటున్న ప్రదేశం నుండి సూర్యాస్తమయం స‌మ‌యాన్ని ఓ ఆహ్లాద‌క‌ర‌మైన ఫోటోని షేర్ చేసింది. చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని పరిశీలిస్తే అది ముంబైలోని స్కై స్క్రాపర్ బాల్కనీ నుండి అంద‌మైన ఫోటోలను షేర్ చేసింద‌ని అర్థ‌మ‌వుతోంది.

అది ఏదైనా భారీ హోటల్ అనుకుంటే పొర‌పాటు. అది భారీ భ‌వంతుల స‌ముదాయం. బాలీవుడ్ రాజధానిలోని తన నివాస ప్రాంతం నుండి సమంతా ఈ ఫోటోని షేర్ చేసి ఉంటుంద‌ని అంతా భావిస్తున్నారు. సీ వ్యూయింగ్ తో ఉన్న‌ 3BHK ఫ్లాట్ ని కొనుక్కుంద‌ని అంతా భావిస్తున్నారు. ముంబైలో రామ్ చ‌ర‌ణ్ - బ‌న్ని స‌హా ప‌లువురు స్టార్ హీరోలు సొంత అపార్ట్ మెంట్ల‌ను క‌లిగి ఉన్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. అదే జాబితాలో స‌మంత పేరు చేరింద‌ని భావించాలి.

ప్ర‌స్తుతం రాజ్ అండ్ డీకేతో సిటాడెల్ సిరీస్ షూటింగ్ కోసం ముంబైలో ఉన్న స‌మంత త‌దుప‌రి భారీ బాలీవుడ్ సినిమాల్లో న‌టించేందుకు ప్లాన్ చేస్తోంద‌ని స‌మాచారం. ఆరోగ్య ప‌రంగా ఇప్పుడు డోఖా లేద‌ని స‌మంత భావిస్తోంది. అనారోగ్య స‌మ‌స్య ఉన్నా దానిని ఎదుర్కొనే ధైర్యం త‌న‌కు ఉంది. ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 త‌ర్వాత స‌మంత వెబ్ సిరీస్ ల‌పైనా పూర్తిగా దృష్టి సారిస్తోంది. వెబ్ సిరీస్ ల‌తో పాన్ ఇండియా స్టార్ డ‌మ్ చాలా సుల‌వుగా సాధ్య‌మ‌వుతుంద‌ని స‌మంత నిరూపించింది. ఇటు విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ఖుషీ చిత్రంలో స‌మంత న‌టించాల్సి ఉన్న సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.