బాలయ్యతో చిట్ చాట్..సమంత ఓపెన్ అవుతుందా!

Mon Sep 26 2022 11:20:36 GMT+0530 (India Standard Time)

Samantha to Come in Unstoppable 2 Show

నటసింహ బాలకృష్ణ హోస్ట్ గా చేసిన ఆహా అన్ స్టాపబుల్   షో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. ఆ షోకి బాలయ్య మాత్రమే న్యాయం చేయగలరు అనిపించింది. తనదైన శైలి చమ్మక్కులు..సెటైర్లు ఆద్యంత అన్ స్టాపబుల్ ని రక్తి కట్టించాయి. ఓటీటీ వేదికగా సెలబ్రిటీ ఇంటర్వ్యూలు  చేయడం ఓటీటీ చరిత్రలో నే ఇదే మొదటి సారి కావడం విశేషం.అందుకే ఆహా మైలేజ్ ఒక్కసారిగా పెరిగింది. త్వరలో అన్ స్టాపబుల్ -2 ముస్తాబవుతోన్న సంగతి తెలిసిందే. దీనిని బాలయ్య నే హోస్ట్ చేస్తున్నారు. ముందుగా ఈ షోకి గెస్ట్ లుగా ప్రాణ స్నేహితులు పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ని తీసుకురావాలనుకున్నారు. వాళ్లిద్దరితో అన్ స్టాపబుల్-2 ని వాళ్లిద్దరితో లాంచ్ చేస్తే నెక్స్ట్ లెవల్లో ఉంటుందని ప్లాన్ చేసారు.

కానీ వాళ్లిద్దరి షెడ్యూల్ బిజీ గా ఉండటంతో రావడం వీలు పడలేదుని సమాచారం. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరికి బధులుగా హీరోయిన్ సమంతను తీసుకురావలని డిసైడ్ అయ్యారు  నిర్వాహకులు. ఇదే ఆహా కోసం సమంత గతంలో సామ్ జామ ప్రోగ్రాం చేసిన సంగతి  తెలిసిందే. ఆ రకమైన బాండింగ్ ని ఆహాతో అమ్మడు ముందే కల్గి ఉంది.

అలాంటి సమంతని తీసుకొస్తే? ఎన్నో విషయాల గురించి కూలంకుశంగా చర్చిచడానికి ఛాన్స్ ఉంటాదన్నది  నిర్వాహకుల ప్లాన్ గా కనిపిస్తుంది. నాగచైతన్యతో విడాకులు తర్వాత సమంత  బాలీవుమ్  లో కాఫీవిత్ కరణ్ టాక్ షోకి  మాత్రమే హాజరైంది. ఆ తర్వాత చాలా షోలక ఆహ్వానించినా  సామ్ వెళ్లలేదు. ఎక్కడా ఇంటర్వ్యూలు  కూడా ఇచ్చింది లేదు.

వ్యక్తిగతంగా సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు పంచుకోవడం మినహా వ్యక్తిగత విషాయలేవి పంచుకోలేదు. అలాంటి సామ్  కరణ టాక్ షో లో మాత్రం చైతన్యతో  రిలేషన్ షిప్ గురించి చెప్పుకొచ్చే ప్రయత్నం  చేసింది.

ఈ నేథ్యంలో అన్ స్టాపబుల్ -2 లో బాలయ్య అడిగితే ఆ విషయాల గురించి చెప్పదా? అంటూ సందేహిస్తున్నారు. కరణ్ టాక్ షోని....ఆహా టాక్ షోని వేర్వేరుగా చూస్తుందా?  అన్నది ఓ క్లారిటీ వస్తుంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.