ప్రియాంక ఫ్యామిలీ రోస్టింగ్ పై సమంత స్పందన..!

Thu Nov 25 2021 12:00:39 GMT+0530 (IST)

Samantha responds to Priyanka family roasting

ఇటీవల నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన సమంత.. కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. వరుస ప్రాజెక్ట్స్ సైన్ చేస్తూ బిజీగా మారడానికి ట్రై చేస్తోంది. అదే సమయంలో ఎప్పటిలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ పలు సందేశాలను ఫాలోవర్స్ తో పంచుకుంటోంది.ఫోటోషూట్స్ కు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పాల్గొన్న 'జోనాస్ బ్రదర్స్ ఫ్యామిలీ రోస్ట్ షో' పై ఇన్స్టాగ్రామ్ లో స్పందించింది.

ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ మరియు అతని బ్రదర్స్ తో కలిసి ఇటీవల 'జోనాస్ బ్రదర్స్ ఫ్యామిలీ రోస్ట్ షో' చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ మొదలైంది.

ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో 'జోనాస్' అనే పేరును తొలగించడంతో.. ప్రియాంక - నిక్ విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లు షికార్లు చేశారు. ఈ నేపథ్యంలో వాటికి చెక్ పెడుతూ తాజాగా వచ్చిన ఫ్యామిలీ రోస్ట్ షో నెట్టింట సందడి చేస్తోంది.

'జోనాస్ బ్రదర్స్ ఫ్యామిలీ రోస్ట్ షో' వీడియోని ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో తన భర్తతో పాటుగా ఆయన సోదరులు సోఫీ చార్నర్ - డేనియల్ జోనాస్ రోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా గ్లోబల్ బ్యూటీ మాట్లాడుతూ.. ''నిక్ కు నాకు మధ్య పదేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.

కాబట్టి నిక్ అర్థం చేసుకోని 90ల నాటి పాప్ సంస్కృతి గురించి నేను వివరించాను. టిక్ టాక్ వంటి వాటిని ఉపయోగించడం గురించి నిక్ నాకు చెబుతుంటాడు. సక్సెస్ ఫుల్ యాక్టింగ్ కెరీర్ ఎలా ఉంటుందో నేను అతనికి చూపించాను.

జోనాస్ బ్రదర్స్ ఆన్ లైన్ లో ఎంత కంటెంట్ పోస్ట్ చేశారో మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే నా ఫాలోవర్స్ ముందు వీళ్ళ ఫాలోవర్స్ తక్కువ. కాబట్టి జోనాస్ ఫ్యామిలీ నుండి మోస్ట్ పాపులర్ పర్సన్ ని నేనేనని భావిస్తున్నాను'' అని చెప్పి అందరినీ నవ్వించింది.

అయితే ప్రియాంక షేర్ చేసిన ఈ వీడియోపై ఇన్స్టాగ్రామ్ లో సమంత స్పందించారు. చోప్రా తన భర్తను రోస్టింగ్ చేయడాన్ని చూసి 'అమేజింగ్' అని కామెంట్ తో స్టోరీ పెట్టింది.

ఒక సామ్ సినిమాల విషయానికొస్తే.. 'శాకుంతలం' సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. 'కాతువాకుల రెండు కాదల్' చిత్రం డిసెంబర్ లో విడుదల కానుంది. ఇదే క్రమంలో రెండు ద్విభాషా చిత్రాలను ప్రకటించిన సమంత.. 'పుష్ప' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది.