Begin typing your search above and press return to search.

సీతా'రామ్‌' కి జోడీగా సమంత!

By:  Tupaki Desk   |   5 Aug 2022 4:30 PM GMT
సీతారామ్‌ కి జోడీగా సమంత!
X
సీతారామం సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుల్కర్‌ సల్మాన్‌ మరో సారి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు అనే టాక్‌ మెల్ల మెల్లగా వస్తుంది.

సినిమాలో దుల్కర్‌ సల్మాన్ యొక్క లుక్ మరియు అతడి నటనకు యూత్‌ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. మలయాళ స్టార్‌ అయినా కూడా ఒక తెలుగు హీరోగా ఆయన్ను తెలుగు ప్రేక్షకులు స్వీకరించారు.. స్వీకరిస్తున్నారు.

తెలుగు లో ఇక నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తానంటూ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ప్రకటించిన దుల్కర్ సల్మాన్ తన కొత్త సినిమా 'కింగ్ ఆఫ్‌ కొత' ను పట్టాలెక్కించేందుకు గాను సిద్ధం అయ్యాడు. సీతారామం సినిమా కోసం గత నెల రోజులుగా బిజీ బిజీ గా గడిపిన దుల్కర్ సల్మాన్ ఈ నెల వరకు విశ్రాంతిలో ఉండి వచ్చే నెల నుంచి కొత్త సినిమా షూటింగ్‌ లో జాయిన్ అవ్వబోతున్నాడు.

కింగ్‌ ఆఫ్ కొత సినిమా కు అభిలాష్ జోషి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా లో దుల్కర్ సల్మాన్‌ కు జోడీగా సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. మహానటి సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు.. కానీ కాంబో సన్నివేశాలు లేవు. కింగ్ ఆఫ్ కొత సినిమాలో మాత్రం ఇద్దరు కలిసి లవ్ అండ్ రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా నటిస్తారని తెలుస్తోంది.

ఇప్పటి వరకు తెలుగు.. తమిళం.. హిందీ భాషల్లో నటించిన సమంత మొదటి సారి దుల్కర్‌ సల్మాన్‌ కోసం మలయాళ సినిమాల్లో నటించేందుకు సిద్ధం అయ్యింది. హీరోయిన్ గా ఒక వైపు బాలీవుడ్‌ లో వరుసగా నటిస్తున్న సమంత మలయాళ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పడం నిజంగా ఆశ్చర్యకర విషయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

కింగ్ ఆఫ్ కొత సినిమా లో సమంత ఎంట్రీ తో కచ్చితంగా పాన్ ఇండియా సినిమా గా మార్కెట్‌ పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమా ను సెప్టెంబర్‌ లో మొదలు పెట్టేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.