Begin typing your search above and press return to search.

సమంత తల్లిగా అలనాటి స్టార్ హీరోయిన్

By:  Tupaki Desk   |   19 March 2023 10:28 PM GMT
సమంత తల్లిగా అలనాటి స్టార్ హీరోయిన్
X
సమంత హీరోయిన్ గా శాకుంతలం అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తూనే స్వయంగా గుణశేఖర్ టీం వర్క్స్ బ్యానర్ మీద ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. సినిమా మొత్తాన్ని దిల్ రాజు కొనుక్కున్నాడని చెబుతున్న గుణశేఖర్ మాత్రం అన్ని విషయాల్లోనూ టెన్షన్ పడుతూనే ఉండడంతో గుణశేఖర్ సినిమాగానే అందరూ భావిస్తున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది.

కానీ సమంత మయోసైటిస్ బారిన పడటంతో పాటు సినిమాని త్రీడీలో చూస్తేనే కిక్ ఉంటుందని గుణశేఖర్ భావించిన నేపథ్యంలో సినిమాను 3d ఫార్మేట్ లోకి మార్చేందుకు సమయం పడుతూ ఉండడంతో సినిమా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఏప్రిల్ నెలలో 14 వ తేదీన విడుదల అవుతుంది. ఇక ఈ సినిమా ఫైనల్ కాపీని ఇటీవలే చూసిన సమంత సినిమా అద్భుతంగా వచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సినిమా మీద ఉన్న ఆసక్తి పెరుగుతుంది.

విశ్వామిత్ర మహర్షి అప్సరసలో ఒకరైన మేనక దంపతుల కుమార్తె అయిన శాకుంతలం, దుష్యంతుల కథే ఈ శాకుంతలం సినిమా. శాకుంతల, దుష్యంతుల ప్రేమాయణం గురించి గుణశేఖర్ తనదైన శైలిలో ఈ సినిమాను తెరెక్కించారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విశ్వామిత్ర మహర్షిగా మోహన్ బాబు నటించారు. ఆయన సరసన నటిస్తున్న నటికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఎట్టకేలకు రిలీజ్ చేశారు. రోజా మూవీతో ఒక్కసారిగా కుర్ర కారు అందరి మదిని దోచి గిలిగింతలు పెట్టిన మధుబాల అలియాస్ మధు ఈ సినిమాలో మేనక పాత్రలో నటిస్తున్నారు.

అంటే సమంత తల్లి పాత్రలో నటిస్తున్నారు. ధవళ వస్త్రాల్లో ఆమె విడిచిపోతున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాక సినిమా ఏప్రిల్ 14వ తేదీన విడుదల కాబోతోందని ప్రకటించారు. ఇక పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద సమర్పిస్తుండగా తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలకు రంగం సిద్ధమైంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.