మాతృత్వం గురించి సమంత చెప్పిన మాటలు..!

Thu Jan 27 2022 06:00:02 GMT+0530 (IST)

Samantha interesting comments about pregnancy

అగ్ర కథానాయిక సమంత తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికి దాదాపు నాలుగు నెలలు కావొస్తోంది. హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సామ్.. నాలుగేళ్ళకే పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. స్టార్ కపుల్ తమ జీవితంలో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోడానికి గల కారణాలు ఏంటనేది వెల్లడించనప్పటికీ.. విడాకుల ప్రకటనపై ఇద్దరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.నిజానికి విడాకుల వ్యవహారంలో సమంత వైపు తప్పు ఉందనే విధంగా అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సామ్ పిల్లలను కనడానికి ఇష్టపడలేదని.. అందుకే విడిపోయే దాకా వచ్చిందని నెటిజన్స్ వ్యాఖ్యానించారు. సమంత అభిమానులు మాత్రం ఈ కామెంట్స్ ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వచ్చారు. గతంలో సామ్ పిల్లల గురించి మాట్లాడిన వీడియోలను ఇందుకు సాక్ష్యంగా షేర్ చేశారు.

మాతృత్వం గురించి సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఓ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ''ఆడవాళ్లు చాలా చాలా స్ట్రాంగ్. ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది మోస్ట్ పెయిన్ ఫుల్ ప్రొసీజర్. ఎలాంటి ఆపరేషన్ లేకుండా డాక్టర్ రూమ్ లో ఒక చైల్డ్ కి జన్మనిస్తారు. కేవలం తల్లి మాత్రమే అలాంటి అత్యంత బాధాకరమైన ప్రక్రియను అనుభవించి కూడా బిడ్డని చూడగానే నవ్వగలుగుతుంది'' అని సమంత ఈ ఇంటర్వ్యూలో తెలిపింది.

అలానే గతంలో యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేసే ఓ టాక్ షోలో కూడా సమంత మాతృత్వం గురించి మాట్లాడుతూ తనకు మదర్ అవ్వడం ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. తనకు 30 ఏళ్ళు వచ్చే సరికి తల్లిని అవ్వాలని.. ఎందుకంటే తన బిడ్డకు 15 ఏళ్ళు వచ్చే సరికి తనతో ఆడుకునే శక్తి ఉండగలగాలని సామ్ పేర్కొంది.

ఇక కెరీర్ విషయానికొస్తే సమంత విడాకుల ప్రకటన తర్వాత పూర్తిగా సినిమాల మీద ఫోకస్ పెట్టింది. వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే 'శాకుంతలం' 'కాతు వాకుల రెండు కాదల్' వంటి రెండు సినిమాలను పూర్తి చేసిన సామ్.. ప్రస్తుతం 'యశోద' అనే పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో పాల్గొంటోంది. ఇదే క్రమంలో 'అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్' అనే హాలీవుడ్ సినిమాతో పాటుగా ఓ బైలింగ్విల్ ప్రాజెక్ట్ కు కమిట్ అయింది.