Begin typing your search above and press return to search.

చై ఫ్యాన్స్ నొచ్చుకునేలా స‌మంత మాట‌లు!?

By:  Tupaki Desk   |   6 Dec 2021 2:30 AM GMT
చై ఫ్యాన్స్ నొచ్చుకునేలా స‌మంత మాట‌లు!?
X
నాగ చైత‌న్య నుంచి విడిపోతున్నాన‌ని ప్ర‌క‌టించిన‌ త‌ర్వాత స‌మంత సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎలాంటి ట్రోలింగ్ కి గురైందో తెలిసిందే. చైత‌న్య‌తో బ్రేక‌ప్ కి కారణం ఏదైనా కానీ స‌మంత‌ ఒక్క‌రినే బాధ్యురాలిని చేస్తూ ట్రోల్స్ ఎదుర‌య్యాయి. ఆమెను టార్గెట్ చేస్తూ ఎన్నో కామెంట్లు చేసారు. మ‌న‌సు నొచ్చుకునేలా..గుండె ప‌గిలే కామెంట్ల‌తో విరుచుకుప‌డ్డారు. విడాకుల విష‌యంలో చైత‌న్య త‌ప్పు ఎంతమాత్రం లేద‌ని...సామ్ కార‌ణంగానే వివాహ బంధం వీగిపోయింద‌ని ర‌క‌ర‌కాల కామెంట్ల‌తో ఆమెను ఎంతగానో బాధించారు. వాటిని స‌మంత ఎంతో ధైర్యంగా ఎదుర్కుంది. ప్ర‌తీ కామెంట్ ని పాజిటివ్ గా తీసుకుని ఎవ‌రి మ‌న‌సు నొప్పించ‌కుండా ముందుకు వెళ్లిపోయింది.

ఒత్తిడిని త‌ట్టుకుంటూ తెలివైన నిర్ణ‌యాలు తీసుకుని కెరీర్ ని ప్లాన్ చేసుకుని వెళ్తోంది. అయితే తాజాగా ఓ ప్ర‌ఖ్యాత మ్యాగ‌జైన్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో విడాకుల గురించి .. ట్రోలింగ్ గురించి స్పందించింది. అయితే ముందుగానే త‌న మాట‌ల‌తో అంద‌రూ అంగీక‌రిస్తార‌ని అనుకోవ‌డం లేద‌ని చెప్పేసింది. నేను ష‌ర‌తుల‌ను అంగీకారాన్ని డిమాండ్ చేయ‌ను. విభిన్న అభిప్రాయాల్ని క‌లిగి ఉండ‌మ‌ని ఎవ‌రిని ప్రోత్స‌హించ‌ను. కానీ ఇప్ప‌టికీ మ‌నం ఒకరినొక‌రు ప్రేమించుకోవ‌చ్చు... క‌రుణించవ‌చ్చు. వారి నిరుత్సాహాన్ని మ‌రింత నాగ‌రికంగా వ్య‌క్తం చేయ‌మ‌ని మాత్ర‌మే నేను అభ్య‌ర్ధిస్తాను అని తెలిపింది. నిజానికి ఒకరి వ్య‌క్తిగ‌త జీవితంపై ట్రోల్స్ త‌గ‌దు. ఆ స‌మ‌యంలో స‌మంత పై ట్రోల్స్ నిజంగా హ‌ద్దు మీరాయనే చెప్పాలి.

ఇక సమంత సినిమాల లైన‌ప్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం `శాకుంత‌లం`లో న‌టిస్తోంది. ఇది లేడీ ఓరియేంటెడ్ మూవీ. చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం విడుద‌ల కానుంది. అలాగే బాలీవుడ్ లో రెండు సినిమాల‌కు స‌మంత‌ సైన్ చేసింది. అందులో ఒక‌టి హీరోయిన్ తాప్సీ సొంత నిర్మాణ సంస్థ‌లో చేస్తోంది. ఇది లేడీ ఓరియేంటెడ్ సినిమా అని స‌మాచారం. మ‌రో ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్త వివ‌రాలు తెలియాల్సి ఉంది.