వారిద్దరికి పచ్చజెండా ఊపేసిన సామ్..

Mon Jan 17 2022 11:09:31 GMT+0530 (India Standard Time)

Samantha Upcoming Movies

వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడుతున్న సమయంలో.. కెరీర్ మీద కాన్సట్రేషన్ పెట్టటం కష్టమవుతుందన్న మాట వినిపిస్తుంటుంది. అందునా గ్లామర్ ప్రపంచంలో.. వ్యక్తిగత సమస్యలు గుది బండగా మారుతుంటుంది. కానీ.. సమంత పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. నాగచైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత ఆమెకు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. దీనికి తోడు ఆమె ఎంతో ఆలోచించి.. వద్దనుకుంటేనే చేసిన పుష్ప ఐటెం సాంగ్ బ్లాక్ బస్టర్ కావటమే కాదు.. సమంత ఇమేజ్ ను మరింత పెంచేలా చేసింది.ఈ పాట కోసం ఆమె పడిన కష్టం.. ప్రదర్శించిన కమిట్ మెంట్ అందరిని ముచ్చట పడేలా చేసింది. ఆమె టాలెంట్ ను తమ సినిమాలకు వినియోగించుకోవటానికి వీలుగా పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. దీనికితగ్గట్లే ఒకటి తర్వాత ఒకటి చొప్పున.. ప్రాజెక్టులను ఫైనల్ చేస్తూ బాగా బిజీ అవుతున్నారు.తాజాగా ఆమె మరో వెబ్ సిరీస్ కు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఫ్యామిలీమ్యాన్ 2 వెబ్ సిరీస్ పుణ్యమా అని జాతీయ స్థాయిలో ఆమెకు లభించిన పేరుప్రఖ్యాతులు.. వచ్చిన ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకే మరో వెబ్ సిరీస్ కు ఆమె ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ లక్కీ ఛాన్సునుఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్లు రాజ్ అండ్ డీకేలకు లభించిందని చెబుతున్నారు. తాము చేయనున్న తదుపరి వెబ్ సిరీస్ కోసం సమంతను సంప్రదించగా.. అందుకు ఆమె ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు సైతం సమంతను తమ ప్రాజెక్టుల్లోకి తీసుకోవాలని భావిస్తున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ తో సమంత చర్చలు జరుపుతున్నరని.. వారి ప్రాజెక్టుకోసం సామ్ కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని చెబుతున్నారు. ఏమైనా.. ఒకటి తర్వాత  ఒకటిగా ప్రాజెక్టులను ఓకే చెబుతూ గతానికి మించి సామ్ బిజీ అయిపోతుందని చెప్పాలి.