Begin typing your search above and press return to search.

సమంత 'ది స్ట్రాంగ్ గర్ల్'..!

By:  Tupaki Desk   |   20 March 2023 3:00 PM GMT
సమంత ది స్ట్రాంగ్ గర్ల్..!
X
స్టార్ హీరోయిన్ సమంత తన జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగినా.. ఎంతటి కష్టం తనని పలుకరించినా దాన్ని తన శక్తితో దాటి సత్తా చాటుతుంది. కెరీర్ కొద్దిగా గాడి తప్పుతుంది అనుకున్న టైంలో మళ్లీ వరుస సినిమాలు చేస్తూ వచ్చిన అమ్మడు చైతుతో మ్యారేజ్ మళ్లీ కెరీర్ రిస్క్ లో పడింది. పెళ్లైనా సరే తన నటన తో మరోసారి ప్రేక్షకులను అలరించి ఇంప్రెస్ చేసింది సమంత. ఇక ఆఫ్టర్ డైవర్స్ మరోసారి పరిస్తితులు తనని ఒంటరిని చేసినా వాటిని దాటుకుని మళ్లీ సినిమాలు చేస్తూ వస్తుంది.

అంతా బాగుంది అనుకునే టైంలో మయోసైటిస్ వల్ల మరోసారి ఆమెకి షాక్ తగిలింది. వచ్చిన వ్యాధిని తగ్గించుకు నేందుకు సమంత పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఫైనల్ గా తన కోట్లమంది అభిమానుల ప్రేమ అభిమానంతో తనకు వచ్చిన వ్యాధిని కూడా జయించింది సమంత. ఇప్పుడిప్పుడే అంతా సెట్ రైట్ అవగా మళ్లీ అమ్మడు జిమ్s వర్క్ అవుట్స్ తో సర్ ప్రైజ్ చేస్తుంది. లైఫ్ లో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా సమంత వాటిని దాటుకుని ధైర్యంగా ఉంది.

ఇక లేటెస్ట్ గా అమ్మడి జిం వర్క్ అవుట్ ఫోటోస్ చూసి ఆమె ఫ్యాన్స్ సమంత ఎప్పటికీ తగ్గదంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంత లైఫ్ ఓ స్ఫూర్తిదాయకమని కొందరు అంటున్నారు. సగటు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా సమంత జిమ్ వర్క్ అవుట్స్ చూసి స్ట్రాంగ్ గర్ల్ అని కామెంట్ పెట్టింది. స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నా తన లైఫ్ లో జరిగిన కొన్ని విషయాల వల్ల రిస్క్ లో పడిన సమంత మళ్లీ అదే ఫోర్స్ తో బౌన్స్ బ్యాక్ అయ్యింది.

ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాలో నటిస్తుంది. ఆల్రెడీ గుణశేఖర్ డైరెక్షన్ లో చేసిన శాకుంతలం రిలీజ్ కు రెడీ అయ్యింది. ఏప్రిల్ 14న శాకుంతలం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాపై సమంత చాలా హోప్స్ పెట్టుకుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.