Begin typing your search above and press return to search.

U-టర్న్ తీసుకోని సమంతా అక్కినేని

By:  Tupaki Desk   |   10 Dec 2019 5:30 PM GMT
U-టర్న్ తీసుకోని సమంతా అక్కినేని
X
స్టార్ హీరోయిన్ సమంతా ఈమధ్య తన సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. రెగ్యులర్ సినిమాలను ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం సమంతా '96' తెలుగు రీమేక్ లో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా త్వరలో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 తో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కి కూడా ఎంట్రీ ఇస్తోంది. ఇదిలా ఉంటే ఈమధ్య సమంతా ఒక బాలీవుడ్ అఫర్ ను తిరస్కరించిందని సమాచారం.

సమంతా హీరోయిన్ గా తెరకెక్కిన 'U-టర్న్' సినిమా పోయినేడాది రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇది ఒక కన్నడ సినిమా రీమేక్. ప్రస్తుతం ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ హిందీ వెర్షన్ నిర్మాతలు ఈ సినిమాలో ప్రధాన పాత్రకు సమంతాను సంప్రదించారట. అయితే సమంతా ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట. ఇప్పటికే ఒకసారి నటించిన కథలో మరోసారి నటిస్తే అందులో ఎగ్జైట్మెంట్ ఏమీ ఉండదనే ఆలోచనతోనే ఈ సినిమాకు 'నో' చెప్పిందట.

దీంతో హిందీ వెర్షన్ నిర్మాతలు సమంతాకు బదులుగా తాప్సీని ఈ ఎంచుకున్నారట. తాప్సీ కూడా 'U-టర్న్' రీమేక్ ఆఫర్ కు ఓకే చెప్పిందట. ఈ మొత్తం ఎపిసోడ్ లో అర్థం అయ్యేదేంటంటే సమంతా బాలీవుడ్ ఎంట్రీ మిస్ అయింది. హిందీ ప్రేక్షకులు సామ్ ను మిస్ అయినట్టే.