Begin typing your search above and press return to search.
కన్ఫ్యూజన్ పై సామ్ నోరు విప్పాల్సిందేనా?
By: Tupaki Desk | 31 Jan 2023 8:00 AMసమంత గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతోంది. 'యశోద' మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా తాను సెలైన్ బాటిల్ తో డబ్బింగ్ చెబుతున్న ఓ ఫొటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి షాకిచ్చింది. సదరు ఫొటోతో పాటు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. తాను గత కొంత కాలంగా మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని, ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతోందని స్పష్టం చేసింది.
సామ్ చేసిన ప్రకటనతో అభిమానులు, సెలబ్రిటీలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తను త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్తిస్తున్నామని, మళ్లీ మీరు రెట్టించిన ఉత్సాహంతో తిరిగి కోలుకుంటారని సామ్ కు మానసిక ధైర్యాన్నిచ్చారు. తన ఆరోగ్య సమస్య కారణంగా సామ్ 'యశోద' ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయింది. కానీ సుమకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇస్తూ సామ్ భావోద్వేగానికి గురైన తీరు ప్రతీ ఒక్కరినీ కలచివేసింది.
ఇటీవల 'శాకుంతలం' ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న సమంత స్టేజ్ పైనే తన సరిస్థితిని వివరిస్తూ కన్నీటి పర్యంతం కావడం తెలిసిందే. సామ్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన దగ్గరి నుంచి అభిమానులు, సెలబ్రిటీలు తనకు అండగా నిలుస్తూ సమంతకు మానసి ధైర్యాన్సిస్తున్నారు.
ప్రస్తుతం అందరి దృష్టి ఇప్పుడు 'శాకుంతలం' సినిమాపై పడింది. 3డీ ఫార్మాట్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా గుణశేఖర్ తెరకెక్కించిన ఈ మూవీని ఫిబ్రవరి 17న అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్న విషయం తెలిపిందే.
ఈ మూవీ ప్రమోషన్స్ ని ప్రారంభించబోతున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ 'ఖుషీ' పరిస్థితి ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని నెలలుగా సామ్ కారణంగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని నిరవిధికంగా నిలిపి వేశారు. తను ఎప్పుడు సెట్ లోకి అడుగు పెడితే అప్పుడు సినిమా పూర్తి చేసి గౌతమ్ తిన్ననూరి పీరియాడిక్ డ్రామాకు వెళ్లిపోవాలని విజయ్ దేవరకొండ ఎదురు చూస్తున్నాడు. అయితే సామ్ మాత్రం బాలీవుడ్ దర్శకద్వయం రాజ్ అండ్ డీకె లు చేస్తున్న 'సీటాడెల్' సిరీస్ కు టైమ్ కేటాయిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ముందు అనుకున్న ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి విజయ్ దేవరకొండని సామ్ ఎందుకు ఇబ్బందిపెడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత?.. ఈ కన్ఫ్యూజన్ కి తెరపడాలంటే సామ్ స్పందించాల్సిందే అని అమె అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం సామ్ ముంబైలో వుందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో హైదరాబాద్ రానున్న సామ్ తాజాగా తన చుట్టూ నెలకొన్న కన్ఫ్యూజన్ పై క్లారిటీ ఇస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.