Begin typing your search above and press return to search.

ఇక సమంత ధ్యాసంతా సంపాదనపైనే..

By:  Tupaki Desk   |   31 May 2023 3:14 PM GMT
ఇక సమంత ధ్యాసంతా సంపాదనపైనే..
X
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. వరస సినిమాలతో దూసుకుపోతోంది. ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్ధం ఎప్పుడో దాటింది. అయినా, ఆమె ఇప్పటికే స్టార్ హీరోయిన్ హోదాని ఎంజాయ్ చేస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉన్న సినిమాలు, ఉమెన్ ఓరియంటెడ్ కథలను ఎంచుకుంటోంది. మధ్యలో నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమెకు అవకాశాలు తగ్గలేదు. ఏవో కారణాల కారణంగా వారు ఇప్పుడు విడిపోయారు. ఆ తర్వాత కూడా అవేమీ ఆమె కెరీర్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు.

నిజానికి విడాకుల తర్వాత ఆమె జోరు మరింత పెంచిందనే చెప్పాలి. ఇటీవల యశోధ, శాకుంతలం వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వాటిలో యశోద హిట్ కాగా, శాకుంతంల దెబ్బేసింది. అయినా, ఆమె జోరు తగ్గలేదు. ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ఇండియన్ వర్షన్ లో సమంత నటిస్తోంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన ఆమె నటిస్తోంది. ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

కాగా, సమంత ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం డబ్బు సంపాదించడంపైనే పెట్టిందట. ఎందుకంటే ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ కాలం ఉంటుంది. ఎంత ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు అయినా వాటిని కూడా ఎక్కువకాలం చేయలేరు.

అది కూడా అందరికీ సాధ్యం కాదు. వయసు పెరిగిన తర్వాత హీరోల పక్కన అస్సలు తీసుకోరు. లేదు చేయాలి అంట సీనియర్ హీరోల సరసన చేయాల్సి ఉంటుంది.

ఇప్పటికే సమంత వయసు36. మహా అయితే హీరోయిన్ గా ఆమె కెరీర్ రెండు, మూడేళ్లు మాత్రమే ఉంటుంది. ఆ కొద్ది సమయంలోనే ఆమె సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఆమె దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామేత ను ఉపయోగించుకుంటోందట. వీలైనంత వరకు ఎక్కువ ప్రాజెక్టులు ఒప్పుకుంటోంది. దీంతో ఎంత వరకు వీలైంత అంత వెనకేసుకోవాలని అనుకుంటున్నారట.

ఇదిలా ఉండగా.. సమంత నటించిన ఖుషీ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. ఈ మూవీలో ఆమె విజయ్ దేవరకొండ సరసన నటించింది. నిజానికి ఈ సినిమా నాగచైతన్య చేయాల్సిందట. కానీ వారు విడిపోవడంతో ఆయన స్థానంలో విజయదేవరకొండ వచ్చాడు. కాగా, 'చెన్నై స్టోరీ' అనే మరో సినిమా కూడా చేస్తోందని తెలుస్తోంది.