సమంత చేతుల మీదుగా ఆనంద్ దేవరకొండ 'పుష్పక విమానం' సాంగ్..!

Wed Jun 16 2021 11:00:48 GMT+0530 (IST)

Samantha Releasing Pushpaka Vimaanam Song

మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం "పుష్పక విమానం". కొత్త దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో గీత్ సైని హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ హీరో విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గోవర్ధన్ రావు దేవరకొండ - విజయ్ దషి - ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "పుష్పక విమానం" సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టిన మేకర్స్.. 'సిలకా' అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. రామ్ మిరియాల స్వరపరిచిన ఈ సాంగ్.. యూత్ ను మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో మరో పాటను వదలడానికి చిత్ర బృందం రెడీ అయింది. 'కళ్యాణం' అంటూ సాగే ఈ సాంగ్ లిరికల్ వీడియో స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.

జూన్ 18న ఉదయం 11 గంటలకు 'కళ్యాణం' లిరికల్ సాంగ్ ను సమంత విడుదల చేయనున్నారు. హీరో హీరోయిన్ల వివాహం సందర్భంగా వచ్చే ఈ పాటకు రామ్ మిరియాల ట్యూన్ కంపోజ్ చేయగా.. గీత రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. యువ సంచలనం సిధ్ శ్రీరామ్ - మంగ్లీ కలిసి ఈ పాటను ఆలపించారు. 'పుష్పక విమానం' చిత్రానికి హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందించగా.. రవితేజ గిరిజాల ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. నీల్ సెబాస్టియన్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శాన్వి మేఘన - సునీల్ - నరేష్ - హర్షవర్థన్ - అజయ్ - సుదర్శన్ తదితరులు నటిస్తున్నారు.