VD తో సామ్ లిప్ లాక్ సీన్..??

Thu May 19 2022 07:00:01 GMT+0530 (IST)

Samantha Lip Lock Scene With Vijay Devarakonda

లిప్ లాక్స్ అనేవి ఇప్పటి సినిమాల్లో సర్వసాధారణం అయిపోయాయి. ఇంగ్లీష్ సినిమాల నుంచి వచ్చిన ఈ సంప్రదాయం.. నెమ్మదిగా బాలీవుడ్ - టాలీవుడ్ కు కూడా  పాకింది. ఏవో ఒకటీ రెండు సినిమాలు తప్ప మిగతా అన్నిట్లో గాఢమైన చుంబన దృశ్యాలు చూస్తున్నాం.స్టార్ హీరోయిన్లు సైతం ఇప్పుడు లిప్ లాక్ సీన్స్ లో నటించడానికి అభ్యంతరం చెప్పడం లేదు. గతంలో ముద్దంటే చేదనే ముద్దుగుమ్మలు కూడా ఇప్పుడు దేనికైనా రెడీ అంటున్నారు. కరీనా కపూర్ - దీపికా పదుకొణె లాంటి పెళ్ళైన హీరోయిన్లు సైతం లిప్ లాక్స్ కి నో చెప్పడం లేదు.

అయితే దీపికా - కంగనా నుంచి ప్రేరణ పొంది భర్త నుంచి విడిపోయిన దక్షిణాది కథానాయిక సమంత కూడా అలాంటి సీన్ లో నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. సామ్ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో యువ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి ''ఖుషి'' అనే పాన్ సౌత్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

రొమాంటిక్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న 'ఖుషీ' సినిమాలో దర్శకుడు ఓ లిప్ లాక్ సన్నివేశాన్ని ప్రతిపాదించాడట. గతంలో శివ డైరెక్ట్ చేసిన 'మజిలీ' చిత్రంలో నాగచైతన్య - దివ్యాంశ కౌశిక్ మధ్య ఓ ముద్దు సీన్ ఉంటుంది. ఇప్పుడు కథలో భాగంగా విజయ్ - సామ్ మధ్య అలాంటిదే ప్లాన్ చేసారని అంటున్నారు.

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ లిప్ లాక్స్ కి ప్రాచుర్యం పొందాడు. రష్మిక మందన్నా - రాశీ ఖన్నా - షాలినీ పాండే వంటి వారితో ముద్దులను పండించారు వీడీ. అయితే ఇప్పుడు తన కంటే సీనియర్ నటి అయిన సమంత తో చుంబన దృశ్యానికి ఓకే అంటాడా లేదా? డైరెక్టర్ పెట్టిన ప్రపోజల్ ను సమంత టేకప్ చేస్తుందా లేదా? అని అందరూ డిస్కస్ చేస్తున్నారు.

సమంతా ఇప్పటివరకు తన మాజీ భర్త చైతన్యతో మాత్రమే లిప్ లాక్ సీన్స్ చేసింది. 'రంగస్థలం' చిత్రంలో రామ్ చరణ్ తో అలాంటి సన్నివేశమే ఉంది కానీ.. అది కెమెరా జిమ్మిక్ అనే టాక్ ఉంది. ఒకవేళ ఇప్పుడు సామ్ అలాంటి సీన్ చేయడానికి ఒప్పుకుంటే సంచలనమే అవుతుంది.

నిజానికి సమంత ఇటీవల కాలంలో 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ లో చేసినటువంటి బోల్డ్ పాత్రల్లో నటించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. 'పుష్ప' ఐటమ్ సాంగ్ లో తన అందాల ఆరబోతతో కుర్రకారుని ఎలా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విడాకుల ప్రకటన తర్వాత ఆమె చేస్తున్న ఫోటో షూట్స్ కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో 'ఖుషీ' చిత్రంలో వీడీ తో కలిసి లిప్ లాక్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరికొందరు మాత్రం సామ్ గ్లామర్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయినప్పటికీ.. వెండితెరపై గాఢమైన ముద్దు సన్నివేశాలు చేయడానికి సిద్ధంగా లేదని అంటున్నారు.