ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా వేచి చూసిన సిటాడెల్ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ ఆద్యంతం గగుర్పొడిచే యాక్షన్ విన్యాసాలు భారీ స్టంట్స్ తో ఊపిరాడనివ్వని ట్రీటిచ్చింది. ముఖ్యంగా ఈ సిరీస్ లో ఎవరూ ఊహించని రంజైన బెడ్ రూమ్ సన్నివేశాలు ఘాటైన అదర చుంబనాలకు కొదవేమీ ఉండదని నిన్నటి రోజున విడుదలైన ట్రైలర్ రివీల్ చేసింది. ఈ ట్రైలర్ లో పీసీ హద్దులు చెరిపేసి శృంగారంలో చెలరేగిపోయింది. రిచర్డ్ మాడెన్ బెడ్ రూమ్ లో ఉండగా అతడిపై కూచున్న పీసీ తన టాప్ ని తొలగించి చెలరేగిపోవడం టూ హట్ గా కనిపించింది. అలాగే వీలున్న ప్రతిసారీ అతడిని అల్లుకుపోతూ ఘాటైన శృంగార రసాన్ని పండించిన తీరు అభిమానులకు మతి చెడగొట్టింది. ఓవైపు భీకరమైన స్టంట్స్ చేస్తూనే రక్తసిక్తమైన రూపంతో డేరింగ్ ఏజెంట్ గా అదరగొట్టిన పీసీ ఘాటైన శృంగారంతోను సమతూకంలో రక్తి కట్టించింది.
అయితే ఈ స్థాయిలో ఈ సిరీస్ కి సమాంతరంగా భారతీయ
వెర్షన్ సిటాడెల్ లో నటిస్తున్న సమంత రూత్ ప్రభు శృంగార
సన్నివేశాల్లో జీవించడం సాధ్యమేనా? అంటూ నెటిజనులు సందేహాలు వ్యక్తం
చేస్తున్నారు. ముఖ్యంగా కథానాయకుడితో బెడ్ రూమ్ సన్నివేశంలో టాప్ విప్పి
విసిరేయడమే గాక బెడ్ పై చెలరేగిపోవాలి. అలాగే ఘాటైన అదర చుంబనాలతో
రెచ్చిపోవాలి. ఇలాంటి సన్నివేశాలకు భారతీయ వెర్షన్ లో తెరపడిపోతుందా?
లేక వాటిని రాజ్ అండ్ డీకే బృందం సమంతతో యథాతథంగా చిత్రీకరించి
ఉంటారా? అన్నది ఆసక్తి కరంగా మారింది. సమంత ట్రెడిషనల్ లుక్ తో పాటు
ఘాటైన సన్నివేశాల్లోను నటించగలదని ఇంతకుముందు ఫ్యామిలీమ్యాన్ సీజన్
2 నిరూపించింది. అందువల్ల ఇప్పుడు సిటాడెల్ కి అభ్యంతరమేమిటన్న
విశ్లేషణ సాగుతోంది.
నాగచైతన్యతో బ్రేకప్ తర్వాత పుష్ప
చిత్రంలో `ఊ అంటావా..` లాంటి ఐటమ్ పాటలో శృంగారరసం ఒలికించే నృత్యం
చేస్తానంటేనే సమంతను స్నేహితులు బంధువులు సొంత ఇంటి మనుషులు అది
సరికాదని వారించారు. కానీ దానిని ధిక్కరించి స్వేచ్ఛగా ఊ అంటావా..
ప్రత్యేక గీతంలో నర్తించిన తెగువ సమంత సొంతం. అందుకే ఇప్పుడు పీసీ ని
మించేలా సమంత నుంచి అభిమానులు సంథింగ్ ఆశిస్తున్నారు. సిటాడెల్ భారతీయ
వెర్షన్ లో సమంత చెలరేగిపోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు. అయితే
అన్ని అంచనాలకు తెర దించేస్తూ రాజ్ అండ్ డీకే ఘాటైన రొమాంటిక్
సన్నివేశాలను ఎడిట్ చేసి నిరాశపరుస్తారా? అన్నది ఇప్పటికి సస్పెన్స్
గా మారింది.