Begin typing your search above and press return to search.

కండలు పెంచేస్తున్న సామ్.. క్యూట్ పిక్ వైరల్..!

By:  Tupaki Desk   |   2 Jun 2023 12:57 PM GMT
కండలు పెంచేస్తున్న సామ్.. క్యూట్ పిక్ వైరల్..!
X
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమె తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్ధం అవుతోంది. అయినా, ఆమెకు అవకాశాలు తగ్గలేదు. పైగా వరస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇటీవల యశోధ సినిమాతో హిట్ కొట్టిన ఆమెకు శాకుంతలం దెబ్బ గట్టిగానే తగిలింది. దీంతో, ప్రస్తుతం వేరే సినిమాలపై ఫోకస్ పెట్టింది.

కాగా, సమంత అందం విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందో తెలీదు కానీ, ఫిట్నెస్ విషయంలో ఆమె చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఆమె ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పొచ్చు. ఎంత షూటింగ్ లో బిజీగా ఉన్నా వ్యాయామాన్ని ఏ రోజూ పక్కన పెట్టదు. జిమ్ లో కసరత్తులు చేయకుండా ఉండదు. ఎప్పటికప్పుడు తన వ్యాయామానికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.

ఆమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు చూస్తే ఎవరైనా నోరెళ్ల పెట్టాల్సిందే. అలాంటి ఫిజిక్ మొయింటైన్ చేయాలంటే ఇంత కష్టపడాలా అనిపిస్తూ ఉంటుంది. చాలా కఠినమైన వ్యాయామాలు చేస్తూ ఉంటారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఆ ఫోటోలో సమంత కండలు స్పష్టంగా కనపడుతున్నాయి.

తన జిమ్ ట్రైనర్ తో పాటు ఆమె ఈ ఫోటోకి ఫోజు ఇవ్వగా, కండలు స్పష్టంగా కనపడుతున్నాయి. కండలు మెలుతిప్పి ఫోటోకి ఫోజు ఇచ్చినా, సామ్ నవ్వుతూ చాలా క్యూట్ గా కనిపించడం విశేషం. ఈ ఫోటో ఇప్పుడు ఆమె ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం సమంత ఖుషీ మూవీ షూటింగ్ పాల్గొంటోంది. ఈ మూవీ షెడ్యూల్ టర్కీలో జరుగుతోంది. కాగా, అక్కడ షూట్ గ్యాప్ లో విజయ్ తో కలిసి లంచ్ కి వెళ్లిన ఫోటోని కూడా ఆమె షేర్ చేశారు. అది కూడా విపరీతంగా ఆకట్టుకుంది.

మరోవైపు సమంత సిటాడిల్ ఇండియన్ వర్షన్ లోనూ నటిస్తోంది. ఇది వెబ్ సిరీస్ కాగా, వరుణ్ ధావన్ సరసన సమంత నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ హాలీవుడ్ వర్షన్ లో ప్రియాకం చోప్రా నటించడం గమనార్హం.