చై బర్త్ డే లైట్.. హాష్ బర్త్ డేలో సామ్!

Thu Nov 25 2021 12:36:12 GMT+0530 (IST)

Samantha Celebrating November 24th

నవంబర్ 23 ని లైట్ తీస్కున్న సమంత నవంబర్ 24 ని మాత్రం అస్సలు మిస్ చేయక ఘనంగా సెలబ్రేట్ చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ రెండు తేదీల ప్రత్యేకత ఏమిటో? అని ప్రశ్నిస్తే..! ఒకటి నాగచైతన్య బర్త్ డే (నవంబర్ 23) డేట్ అయితే ఇంకోటి పెంపుడు కుక్క హాష్ బర్త్ డే(నవంబర్ 24) డేట్.చైతన్య బర్త్ డే రోజున సామ్ నుంచి ఏదైనా ట్వీట్ వస్తుందని ఆశించినా అది కనిపించలేదు. దాంతో అభిమానులు నిరాశ చెందారు.

కానీ ఇప్పుడు సమంత తన పెంపుడు కుక్క హాష్ పుట్టిన రోజుని నవంబర్ 24న జరుపుకుంది. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మూడో పుట్టిన రోజు సందర్భంగా హాష్ (మహేష్ పూర్తి పేరు) స్టైలిష్ దుస్తులతో కనిపించాడు. సమంత ఏర్పాటు చేసిన పెట్-ఫ్రెండ్లీ కేక్ లను హాష్ తిన్నాడు. పప్పీ ఫ్రెండ్ పుట్టిన రోజు వేడుకల్లో సామ్ తో మరో కుక్క పిల్ల సాషా కూడా కోట్ సూట్ వేసుకుని కనిపించడం కొసమెరుపు.

నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత మొదటిసారిగా తన పెంపుడు కుక్క మహేష్ (హాష్) బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది సమంత. మూడేళ్ల క్రితం ఆ శునకాన్ని దత్తత తీసుకున్న దంపతులు మ`హేష్` అక్కినేని అని పేరు పెట్టారు. ఇప్పుడు వీరిద్దరూ విడిపోవడంతో అక్కినేని ఇంటిపేరు వైదొలగిన సంగతి తెలిసిందే.

బర్త్ డే సెలబ్రేషన్ అనంతరం..``నా చిన్నప్పటి రోజుల్లోకి .. ఎదిగే రోజుల్లోకి వెళుతూ.. మరిన్ని ట్రీట్స్ కోసం వెతుకుతున్నాను! (sic)`` అని సామ్ రాసింది. ఆమె తన కథనానికి సంబంధించిన యూట్యూబ్ లింక్ ను కూడా షేర్ చేసింది. మహేష్ పుట్టినరోజు వేడుకల ఫోటోలను విడుదల చేసింది సామ్.

కెరీర్ మ్యాటర్ కి వస్తే సామ్ వరుస చిత్రాల్లో నటిస్తోంది. శాకుంతలం డబ్బింగ్ ని పూర్తి చేస్తోంది. సమంత చివరిసారిగా దర్శకులు రాజ్ అండ్ DK - ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో కనిపించింది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమైంది. తదుపరి కాతువాకుల రెండు కాదల్ విడుదలకు సిద్ధమవుతోంది.

విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలే కాకుండా సమంత తొలి దర్శకులు శాంతరూపన్ .. హరి-హరీష్ లతో రెండు ద్విభాషా చిత్రాలకు సంతకం చేసింది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో తాప్సీ నిర్మించే సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కథనాలొచ్చాయి. పలు వెబ్ సిరీస్ లలో నటించేందుకు సామ్ ప్రణాళికల్ని విస్తరిస్తోంది.